ఓల్డ్ ఈజ్ గొల్డ్ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్
డాక్ యార్డ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పేన్షనర్స్ అసోసియేషన్.
ఉరకలెత్తే ఉత్సాహం.. ఓల్డ్ ఈజ్ గొల్డ్ అనెలా ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అహల్లాదకరమైన సంగమం విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ ఎలక్ట్రికల్ డిపార్టుమెంటు పెన్షనర్స్ అసోసియేషన్ వారు 9 వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా
మధురం మధురం మన ఆత్మీయ బంధం అంటూ
మిత్రులందరు కలిపి ఒక చోట చేరి సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు అదే రీతిలో ది 22-2-2026 ఆదివారం సింహాచలం రోడ్డు శ్రీనివాసనగర్ దరి గొర్లె నాగార్జున తోట లో
కడువైభంగా వినూత్న రీతిలో వేడుకలు జరుపు కోవడం వీరికి ఆనవాయితి… దాదాపు
మూఫ్ఫై నలబై సంవత్సరాల పాటు రక్షణ రంగం లో దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించి ఉద్యోగ విరమణ చేసిన తరువాత విశ్రాంత ఉద్యోగుల ఒకరికి ఒకరు తోడు అలనాటి ముచ్చట్లు.. పరస్ఫర పలకరింపులు… ఏడు పదుల దాటిన.. వయసు మీద పడిన చెక్కు చెదరని వారి ఆత్మ విశ్వాసం.. అత్మియత…
యువకులకు సహితం
ఈర్ష్య పడేంతగా ఉంది
ఈ అత్మీయ సంగమానికి సుదూర ప్రాంతాల నుండి అలాగే రాష్ట్రేతర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి రావడం నిజం గా ఆశ్చర్యకరం.. అసోసియేషన్ గా ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నా.. క్రమంగా తప్పకుండా ప్రతి ఏటా పిబ్రవరి మాసం లో ఈ కార్యక్రమం జరుగుతుంది
అంతే కాదు.. వయోవృద్దులు అవడం
వల్ల వారి వారి కి కలిగే ఆరోగ్య సమస్యలు పై తగు సూచనలు ఇస్తూ తగిన వైద్య సౌకర్యాలు.. ఏర్పాటు చేయడం… వారి సంక్షేమ పట్ల శ్రద్ధ వహించడం.. ప్రశంసనీయం… ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పేన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు డాక్ యార్డ్ లో అందరికీ ఆదర్శంగా నిలిచారు అనడం లో
సందేహం లేదు.. అలాగే
ప్రతి ఏటా వయసు పైబడిన విశ్రాంత ఉద్యోగుల సేవలను గు గుర్తించి వారికి తగు రీతిలో సన్మానించు కోవడం అభినందనీయం
కార్యక్రమం యావత్తు అత్యంత క్రమశిక్షణ తో
ప్రణాళిక బద్దం నిర్వహించి జయప్రదం గావించడంలో ఆర్గనైజింగ్ కమిటీ ప్రతిభ.. వారి కృషి… కొనియాడదగ్గది.. ఒకరి కోసం ఒకరు అందరి కోసం అందరు సమిష్టితత్వం తో నిర్వహించు కోవడం “మధురం మధురం మన ఆత్మీయ బంధం” అన్న మకుటానికి సార్థకత ఏర్పడి దానికి న్యాయం జరిగింది.. ప్రతి సారి లాగే
ఈ సంవత్సరం కూడా హాజరైన మిత్రులకు చిరు జ్ణాపికలు అందజేయడం
గొప్ప విషయం… ఉదయం హజరై రోజంతా ఉత్సాహం గా ఉల్లాసంగా గడిపి విడ్కోలు సమయంలో భార మైన హృదయాల తో మళ్లీ మళ్లీ కలుద్దాం
అ సమయం కొసం వేచి చూద్దాం.. అనే అందమైన భావన తో
ముందుకు కదిలారు
వయసు మీద పడింది.. ఇంకా ఏముంది లే అని
నిస్తేజ పడక ఓల్డ్ ఈజ్ గొల్డ్ అనెలా ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అనే సూక్తి ని ఋజువు చేస్తూ స్ఫూర్తి దాయకం కార్యక్రమంలో జరగడం
అందరినీ ఆనంద డోలికల ముంచింది.. ఇంతటి మహత్తర కార్యక్రమాని వేదిక కల్పించిన గొర్లె నాగార్జున ఉదార సహకారానికి ధన్యవాదాలు చెప్పక తప్పదు.. ఇలాంటి కార్యక్రమాలు మరింత గా జరగాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాము.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్ టు ఆర్ నరసింహులు పిడిటి, త్రినాధం, పి శ్రీహరి,
ఏ పాపారావు, ఏ అప్పలరాజు ఎంపీ దత్తు,
టి రామ్మోహన్, L to R
జి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












