విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కార్యదర్శిగా శ్రీ ఎం. శంకర్ బాబు బాధ్యతలు స్వీకరణ
శ్రీ ఎం. శంకర్ బాబు విశాఖపట్నం పోర్ట్ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
విశాఖపట్నం పోర్ట్ కు రాక పూర్వం ఆయన మార్మగోవ పోర్ట్ , గోవా, కార్యదర్శిగా సేవలందించారు. కేంద్ర పోర్టులు నౌకా జల రవాణా శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆయనను విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి కార్యదర్శిగా బదిలీ చేసి నియమించారు.
కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే ముందు, శ్రీ శంకర్ బాబు విశాఖపట్నం పోర్ట్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రోష్ని అపరంజి కొరాటి, ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
పోర్ట్ విభాగాధిపతులు, ఉన్నతాధికారులు మరియు సిబ్బంది శ్రీ శంకర్ బాబు గారికి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
















