విశాఖపట్నం పోర్ట్ లో పర్యటించిన శిక్షణలో ఉన్న 2025 ఐఏఎస్ బ్యాచ్
వింటర్ స్టడీ టూర్లో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ శిక్షణా బృందం 2026 ఫిబ్రవరి 9న విశాఖపట్నం పోర్ట్ ను సందర్శించారు.

శిక్షణలో ఉన్న అధికారులను పోర్ట్ అధికారులు హృదయపూర్వకంగా స్వాగతించి, పోర్ట్ యొక్క ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు నిర్వహణా సామర్థ్యాలను వివరించారు.
ఈ సందర్భంగా
• మౌలిక సదుపాయాలు మరియు కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం
• ఆధునీకరణ మరియు యాంత్రీకరణ కార్యక్రమాలు
• కవర్డ్ స్టోరేజ్ సదుపాయాలు
• సోలార్ పవర్ ప్లాంట్ మరియు పరిశ్రమల కోసం STP ద్వారా స్థిరమైన నీటి శుద్ధి వ్యవస్థ
• పెట్టుబడి అవకాశాలు
• ఇటీవల అభివృద్ధి చేసిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ మరియు ట్రక్ పార్కింగ్ టెర్మినల్
• వీపీఏ ద్వారా దిగుమతి–ఎగుమతి కార్యకలాపాలను మెరుగుపరచే అవకాశాలు
పోర్ట్ లో జరుగుతున్న కార్యక్రమాలను సమగ్ర సమాచారాన్ని అందించినందుకు, అలాగే పోర్ట్ యాజమాన్యం ఇచ్చిన ఆతిథ్యానికి ట్రైనీ ఐఏఎస్ లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో వీపీఏకి చెందిన విభాగాధిపతులు మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.












