గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శంకర్ ఫౌండేషన్ సేవలకు ఉత్తమ పురస్కారం ప్రధానం

విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ M.N.హరేందిర ప్రసాద్ చేతులమీదుగా పురస్కారం ప్రధానం
అత్యధిక సంఖ్యలో కంటి శస్త్రచికిత్సలు చేయడంలో విశేష కృషి చేసినందుకు, గ్రామీణ ప్రాంతాల్లో వారి అసాధారణ ఔట్ రీచ్ కార్యక్రమాలకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సేవలకు ప్రతిష్ఠాత్మక ఉత్తమ (ఎన్జీవో) పురస్కారం ను ప్రధానం చేశారు. ఈ ప్రాంతంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా కార్యక్రమం ద్వారా అంధత్వాన్ని నివారించడంలో ఫౌండేషన్ యొక్క అంకితభావం మరియు నిబద్ధతను గుర్తించి ఈ పురస్కారం లభించింది అని ఒక ప్రకటనలో మరియు శ్రీ కె.బంగార్రాజు డిప్యూటీ జనరల్ మేనేజర్ (పీఆర్ అండ్ లైజన్) తెలియచేసారు .
విశాలమైన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ M.N.హరేందిర ప్రసాద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎ.కృష్ణకుమార్ , మరియు శ్రీ కె.బంగార్రాజు డిప్యూటీ జనరల్ మేనేజర్ (పీఆర్ అండ్ లైజన్) అందుకున్నారు.
ఈ అవార్డు బహుకరణ కార్యక్రమములో నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాగ్చి, మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ శ్రీ కేతన్‌గార్గ్ ఐఏఎస్, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నిస్వార్థ సేవ ద్వారా సమాజంపై ఉన్నత సానుకూల ప్రభావం చూపుతున్న శంకర్ ఫౌండేషన్ లోని మొత్తం బృందం అచంచలమైన అంకితభావం, కృషికి ఈ అవార్డు నిదర్శనం.
శంకర్ ఫౌండేషన్ ధర్మకర్తల మండలి చైర్మన్ ఎం.రాందాస్, మేనేజింగ్ ట్రస్టీ ఎ.కృష్ణకుమార్ , ట్రస్టీలు ప్రొఫెసర్ ఏ ప్రస్సన్న కుమార్ , ఏ విజయ్ కుమార్, వైద్యులు, ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బందిని ఈసంధర్బముగా అభినందించారు.
హాస్పిటల్ స్థాపించిన (1997 ) నుండి నేటివరకు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ఐదు లక్షలకు పైగా శస్త్ర చికిత్సలు మరియు 29 లక్షలకు పైగా కంటి పరీక్షలు నిర్వహిచి ఒక మెయిలు రాయిని దాటిందని పేర్కొన్నారు.
ఫొటో శీర్షిక: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఎ.కృష్ణకుమార్, శ్రీ కె.బంగార్రాజు డిప్యూటీ జనరల్ మేనేజర్ (పీఆర్ అండ్ లైజన్) ఉత్తమ ఎన్జీవో అవార్డు ను అందుకున్న దృశ్యం.

















