ద్వారకానగర్ బి.వి.కె. జూనియర్ కళాశాలలో విద్యా భారతి ఆధ్వర్యంలో ‘సప్తశక్తి సంగం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలు ఆచారాలను కాపాడుకుంటాం. స్త్రీ శక్తిని చాటి చెప్పడం ఈ సందర్భంగా ముఖ్యవక్తగా పాల్గొన్న డాక్టర్ కందళ కనకమహాలక్ష్మీరుకుటుంబ ప్రబోధం, నేటియువతి ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు, స్త్రీ యొక్క గొప్పతనం మొదలైన విషయాల ను వివరించారు.
మరోవక్త డా|| పి.కె జయలక్ష్మిగారు మాట్లాడుతూ భారతీయ సనాతన సాంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళల పాత్ర గణనీయమైనదని, మనకు మేలు చేసే ప్రకృతిని ధ్వంసం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్య త ప్రజలం దరిపైన ఉందని తెలియజేశారు .
కళాశాల డైరెక్టర్ శ్రీమతి అంజనిప్రసాద్ గారు చెప్తూ స్త్రీ 7 శక్తులు కలిగి ఉంటుందని. వాటి ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకొనిరావాలని అందులో జ్ఞాపశక్తి, ధైర్యం, మేధ, క్షమాగుణం’ కలిగి భారతీయ తత్వాన్ని మానవాళికి అందించాలని చెప్పారు.



ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల మహిళా అధ్యాపకులు పాల్గోన్నారు. విద్యార్థుల మాతృమూర్తులు పాల్గోన్నా ఈ కార్యక్రమంలో శ్రీమతి. పి. చిన్న బాట్మంటన్ క్రీడాకారిణి మరియు శ్రీమతి. ఎన్. హేమలత గాండ్లను సన్మానించారు

















