విశాఖపట్నం పోర్ట్ లో పర్యటించిన పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ
పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ , గౌరవ సభ్యుల బృందం తమ అధికారిక పర్యటనలో భాగంగా 05-01-2026 న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ను సందర్శించారు.
ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్ పర్సన్ శ్రీమతి రోష్ని అపరంజి, ఐఏఎస్, వివిధ విభాగాల అధిపతులతో కలిసి సాదర స్వాగతం పలికారు.
తదుపరి, కమిటీ సభ్యులు పోర్ట్ లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీమతి రోష్ని అపరంజి, ఐఏఎస్, పోర్ట్ యొక్క సమగ్ర కార్యకలాపాలు మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చేపడుతున్న వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను గౌరవ సభ్యులకు వివరించారు.
పర్యటనలో భాగంగా, పోర్ట్ మౌలిక సదుపాయాలు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునీకరణ మరియు యాంత్రీకరణ కార్యక్రమాలు, కవర్డ్ నిల్వ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమల అవసరాల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) ద్వారా నీటి పునర్వినియోగం వంటి అంశాలపై కమిటీకి అవగాహన కల్పించారు. అదేవిధంగా, విశాఖపట్నం పోర్ట్ ద్వారా దిగుమతి–ఎగుమతి కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఉన్న పెట్టుబడి అవకాశాలు మరియు సాధ్యమైన మార్గాలపై పోర్ట్ బృందం గౌరవ సభ్యులకు వివరించింది.
పోర్ట్ లో జరుగుతున్న కార్యకలాపాల పట్ల గౌరవ పార్లమెంటరీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను శ్రీ డి. రమణ మూర్తి, ఎఫ్ఏ & సీఏఓ మరియు కార్యదర్శి (స్టాట్యుటరీ), విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, మీడియాకు తెలిపారు.


















