రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులను పర్యాటక శాఖ రద్దు చేసింది. కృష్ణా నదిలో పెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాద నేపధ్యంలో మంగళవారం అత్యవసన సమావేశం ఏర్పాటు చేసింది. సచివాలయంలో పర్యాటక శాఖలో జరిగిన ఈ బేటీలో మంత్రి భూమా అఖిల ప్రియ ప్రైవేటు ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటు వ్యవహారాలు, భద్రత, రక్షణ అంశాలపై విధివిధానాలు రూపోందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసారు. కమిటీ సూచన మేరకు కొత్తగా ప్రైవేట్ బోటు లైసెన్సులు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి కొంతమంది ఆపరేట్లరు రాకపోవడంపై మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేస్తూ హాజరుకాని బోటు యజమానులుకు మరోసారి లైసెన్సులు ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు. అలాగే అధికారులను ప్రాంతాల వారిగా వివరాలడిగి తెలుసుకున్నారు.