HomeUncategorizedVisakhapatnam Vizagvision: రెండేళ్ల చిన్నారిలో కొత్త ఉషోదయంశస్త్రచికిత్స ద్వారా కంటి లో వెలుగులు నింపిన శంకర్ ఫౌండేషన్ వైద్యులు విశాఖపట్నం, డిసెంబర్ 4, 2025 – చింతపల్లి సమీపంలోని తాడిబండ గ్రామానికి చెందిన రెండేళ్ల గిరిజన బాలిక కు శంకర్ ఫౌండేషన్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు జీవితంలో వెలుగు నింపి సమాజానికి అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్న సంస్థగా మరోసారి తమ నిపుణతను చాటుకున్నారు. ఆమె కుడి కంటికి సంక్లిష్టమైన శస్త్రచికిత్స ఫౌండేషన్ ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగింది . వివరాల్లోకి వెళితే సీత (పేరు మార్చడం జరిగింది) అనే 2 సంవత్సరాల ఆ చిన్నారి ఇంటిదగ్గర ఆడుకుంటూ పడిపోవడంతో కంటికి తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం అయింది. ఆమెను మొదట చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు (PHC) వెళ్లగా , అక్కడ వైద్యులు ఆమె తల్లిదండ్రులను విశాఖపట్నంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి (REH)కి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి అత్యవసరంగా కంటికి శస్త్రచికిత్స నిర్వహించవలసిన అవసరం ఉందని శంకర్ ఫౌండేషన్ కి పంపించడం జరిగింది. ఆ చిన్నారి తల్లి దండ్రులు ఆవేదనతో అయోమయ పరిస్థితులలో పాపను శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. శంకర్ ఫౌండేషన్ కార్నియా విభాగాధిపతి డాక్టర్ నస్రిన్ మార్గదర్శకత్వంలో డాక్టర్ వికె యశస్విని నైపుణ్యం కలిగిన వైద్యులు సంరక్షణలో శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. రెండు రోజుల తర్వాత మరల పరీక్షించిన వైద్యులు పూర్తిగా కోలుకోవడంతో ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. తదుపరి నిర్వహించిన పరీక్షలలో చిన్నారి కంటిచూపు పూర్తిగా మెరుగు పడటంతో వైద్యులు చాలా సంతోషించారు. ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కే బంగార్రాజు మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ వైద్యులు తక్షణమే స్పందించి చిన్నారికి శస్త్రచికిత్స నిర్వహించడం వలన పాప కంటిచూపుని పూర్తిగా కాపాడగలిగామని తెలియజేసారు. . ఈ శస్త్రచికిత్స విజయవంతమై నందుకు ఆ పాప తల్లి దండ్రులు ఉద్వేగానికి గురై డాక్టర్లకు అదేవిధంగా శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా అందించిన శంకర్ ఫౌండేషన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి మాట్లాడుతూ, దిక్కు తోచని స్థితిలో తమ చిన్నారిని ఇక్కడకు తీసుకు వచ్చామని, తమ పాపకు తిరిగి కంటి చూపు ప్రసాదించిన వైద్యులకు ఏంతో రుణపడి ఉంటామని తెలిపారు. పేదలకు సేవ చేయాలనే తన లక్ష్యానికి కట్టుబడి, శంకర్ ఫౌండేషన్ అవసరమైన వారికి నాణ్యమైన కంటి సంరక్షణ అందించడంలో తన అంకితభావాన్ని పునరుద్ఘాటించింది. ఫోటో శీర్షిక : తల్లి దండ్రులతో శస్త్రచికిత్స జరిగిన చిన్నారి
Visakhapatnam Vizagvision: రెండేళ్ల చిన్నారిలో కొత్త ఉషోదయంశస్త్రచికిత్స ద్వారా కంటి లో వెలుగులు నింపిన శంకర్ ఫౌండేషన్ వైద్యులు విశాఖపట్నం, డిసెంబర్ 4, 2025 – చింతపల్లి సమీపంలోని తాడిబండ గ్రామానికి చెందిన రెండేళ్ల గిరిజన బాలిక కు శంకర్ ఫౌండేషన్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు జీవితంలో వెలుగు నింపి సమాజానికి అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్న సంస్థగా మరోసారి తమ నిపుణతను చాటుకున్నారు. ఆమె కుడి కంటికి సంక్లిష్టమైన శస్త్రచికిత్స ఫౌండేషన్ ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగింది . వివరాల్లోకి వెళితే సీత (పేరు మార్చడం జరిగింది) అనే 2 సంవత్సరాల ఆ చిన్నారి ఇంటిదగ్గర ఆడుకుంటూ పడిపోవడంతో కంటికి తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం అయింది. ఆమెను మొదట చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు (PHC) వెళ్లగా , అక్కడ వైద్యులు ఆమె తల్లిదండ్రులను విశాఖపట్నంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రి (REH)కి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి అత్యవసరంగా కంటికి శస్త్రచికిత్స నిర్వహించవలసిన అవసరం ఉందని శంకర్ ఫౌండేషన్ కి పంపించడం జరిగింది. ఆ చిన్నారి తల్లి దండ్రులు ఆవేదనతో అయోమయ పరిస్థితులలో పాపను శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. శంకర్ ఫౌండేషన్ కార్నియా విభాగాధిపతి డాక్టర్ నస్రిన్ మార్గదర్శకత్వంలో డాక్టర్ వికె యశస్విని నైపుణ్యం కలిగిన వైద్యులు సంరక్షణలో శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. రెండు రోజుల తర్వాత మరల పరీక్షించిన వైద్యులు పూర్తిగా కోలుకోవడంతో ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. తదుపరి నిర్వహించిన పరీక్షలలో చిన్నారి కంటిచూపు పూర్తిగా మెరుగు పడటంతో వైద్యులు చాలా సంతోషించారు. ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కే బంగార్రాజు మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ వైద్యులు తక్షణమే స్పందించి చిన్నారికి శస్త్రచికిత్స నిర్వహించడం వలన పాప కంటిచూపుని పూర్తిగా కాపాడగలిగామని తెలియజేసారు. . ఈ శస్త్రచికిత్స విజయవంతమై నందుకు ఆ పాప తల్లి దండ్రులు ఉద్వేగానికి గురై డాక్టర్లకు అదేవిధంగా శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా అందించిన శంకర్ ఫౌండేషన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి మాట్లాడుతూ, దిక్కు తోచని స్థితిలో తమ చిన్నారిని ఇక్కడకు తీసుకు వచ్చామని, తమ పాపకు తిరిగి కంటి చూపు ప్రసాదించిన వైద్యులకు ఏంతో రుణపడి ఉంటామని తెలిపారు. పేదలకు సేవ చేయాలనే తన లక్ష్యానికి కట్టుబడి, శంకర్ ఫౌండేషన్ అవసరమైన వారికి నాణ్యమైన కంటి సంరక్షణ అందించడంలో తన అంకితభావాన్ని పునరుద్ఘాటించింది. ఫోటో శీర్షిక : తల్లి దండ్రులతో శస్త్రచికిత్స జరిగిన చిన్నారి