విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మారేడుపూడి లో దారుణం చోటుచేసుకుంది.భార్య,భర్త ల మద్య గొడవల కారణంగా మద్యం మత్తులో కన్న కొడుకు నే ఒ కసాయి తండ్రి పొట్టనపెట్టుకున్నాడు.ఈ రోజు ఉదయం 8గంటల ప్రాంతంలో ఈగల దినేష్ యాదవ్ తండ్రి తాతానాయుడు గునపాంతో పొడిచి చంపాడ.దీంతో ఆ పసివాడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.భార్యభర్తల మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్ధలు కారణంగా భార్య పార్వతి పుట్టినిల్లయిన కశింకోట మండలం పరవాడపాలెంలో ఉంటుంది.నిన్న తన తల్లితో కలిసి పరవాడపాలెంలో భార్యతో గొడవపడిన బాబూరావు కుమారుడు ధినేష్ని మారేడుపూడి తీసుకువచ్చాడు.ఈ రోజు ఉదయం మద్యం మత్తులో ఆడుకుంటున్న కొడుకుపై అతి పాశవికంగా గునపాంతో పొడిని చంపాడు.దీంతో అక్కడిక్కడే దినేష్ మృతిచెందాడు.కన్న కొడుకు మరణవార్త విన్న తల్లి పార్వతి కన్నీరుమున్నీరు గా విలపిస్తుంది.గ్రామస్థులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.నిందితుడు బాబురావుని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.అనకాపల్లి రూరల్ సి.ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాఅన్నారు. భైట్:రామచంద్రరావు(అని రూరల్ సి.ఐ)