VIZAGVISION:Vizag-Navy Marathon at RK Beach,Visakhapatnam..విశాఖ సాగర తీరంలో ఆదివారం ఉదయం వైజాగ్ నేవీ మారథాన్ పోటీలు రసవత్తరంగా సాగాయి. విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద తెల్లవారు జామున నాలుగు గంటలకు నావికాదళం ఆధ్వర్యంలో మారథాన్ పోటీలు నిర్వహించారు.
42 కి.మీల పూర్తి మారథాన్,21 కి.మీల హాఫ్ మారథాన్లతో పాటు 10 కి.మీలు, 5కి.మీల పరుగు పందేలునిర్వహించారు.
భారతదేశంతో పాటు కెన్యా, ఇథియోపియా దేశాలకుచెందిన పలుగురు అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు.
పూర్తి మారథాన్లో తమిళనాడుకు చెందిన జగదీశన్ ముందుస్వామి మొదటిబహుమతి సాధించగా, మహిళా విభాగంలో కెన్యాకు చెందిన నమోమి మొదటి బహుమతి అందుకున్నారు. వీరివురు మొదటి బహుమతిగా చెరో రూ.లక్ష చొప్పున గెలుపొందారు.
ఈ పోటీల్లోని ఇతర విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు.