VIZAGVISION:It was found that 10,000 acres of was Cannabis cultivated. DGP N Sambasiva Rao,Visakhapatnam..విశాఖ జిల్లాలో గంజాయి సాగు నిర్ములనకు పటిష్ట మైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డిజిపి ఎన్ సాంబశివరావు చెప్పారు . విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిజిపి మాట్లాడుతూ రాష్ట్రంలో విశాఖ జిల్లాలోని 9 మండలాల్లో , తూర్పు గోదావరి జిల్లాలో రెండు మండలాల్లో గంజాయి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారని వీటిని పూర్తి స్థాయిలో నిర్మలించడానికి ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. 10 వేల ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఎక్సయిజ్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా 725 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు వివరించారు . విశాఖలోనే 189 మంది ఫై కేసులు నమోదు చేయడమే కాక ఆస్తులను జప్తు చేసి వారి ఫై పిడి యాక్టును ప్రయోగించినట్టు తెలిపారు . విశాఖలో గంజాయి సాగు ఫై నిర్వహించిన సమీక్షా సమావేసంలో పలు అంశాలు చర్చించినట్టు తెలిపారు . విజయవాడలో త్వరలో ఈ అంశంపై ఆరు జిల్లాల ఎస్పీలతో ప్రాంతీయ సదస్సును నిర్వహించనున్నామని పేర్కొన్నారు