పయినీర్ కేంద్రానికి చంద్రబాబు బృందం.అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం రెండో రోజు పయినీర్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించింది. తమ ప్రాజెక్టులపై సీఎం బృందానికి పయినీర్ గ్లోబల్ ఉపాధ్యక్షుడు బ్రాడ్ లాన్స్ సభ్యులకు వివరించారు. అనంతరం రాత్రి 10.30గంటలకు అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు విత్తన, వ్యవసాయ సంస్థల సీఎఫ్‌వోలు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. రాత్రి 12.30గంటల నుంచి తెల్లవారుజామున 4.30 వరకు జరగనున్న ద్వైపాక్షిక సమావేశాల్లో బృందం పాల్గొనుంది.