VIZAGVISION:Hudhud Cyclone Complets 3years,Visakhapatnam..2014 అక్టోబర్ నెల..విశాఖ వాసులు ఎవ్వరు అంతతేలిగ్గా ఈ రో్జును మర్చిపోలేదు..అందమైన పక్షి పేరు పెట్టుకున్న తుఫాను విశాఖ తీరాన్ని అతలాకుతలం చేసింది..విశాఖ చరిత్రలో 1901 తరువాత అంతటి బీబత్సాన్ని నింపింది హుద్ హుద్ తుఫాను..వేల కోట్ల నష్టం జరుగగా పంటలు, పరిశ్రమలు ధారుణంగా దెబ్బతిన్నాయి..విశాఖ నగరంలో కంరెంట్ పునరుద్దరించడానికే దాదాపు 10 రోజు లసమయం పట్టిందంటేనే పరిస్థితి ఏవిదంగా ఉందో అర్ధం చెసుకోవచ్చు..స్వయంగా ముఖ్యమంత్రి 10 రోజుల పాటు విశాఖలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షించారు..అందరికంటే ఎక్కువగా నష్టపోయింది మాత్రం మత్స్యకారులే..బోట్లు నాశనం అయి..తీరంలో ఉన్న ఇల్లు కొట్టుకుపోయి ప్రత్యక్ష నరకం అనుభవించారు తీరంలో ఉండే మత్స్య కారులు..విశాఖ జిల్లాలో బీమిలి, అచ్చుతాపురం, పరవాడ, నక్కపల్లి, పుడిమడక, రాంబిల్లి ఇలా తీరప్రాంతంలో ఉన్న దాదాపు 10 లక్షలకు పైగా మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..ఒక్క విశాఖ స్టీల్ ప్లాట్ కే దాదాపు రెండు వేల కోట్ల మేరకు నష్టం జరిగింది..విశాఖ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పై కప్పు పూర్తిగా ఎగిరిపోయింది..అందులేని నష్టం..లెక్కకు అందని విదర్శంసం