VIZAGVISION:Improvement of National Highways Leading towards of Andhra Pradesh,Vijayawada….ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం – జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య – ఏడు జాతీయ రహదారి విస్తరణ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి – ఇవాళ మహత్తర కార్యక్రమానికి చరిత్రలో శ్రీకారం చుడుతున్నాం – ఇంత పెద్దఎత్తున జాతీయరహదారిపై ప్రాజెక్టులు ఎప్పుడూ రాలేదు – ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలపాలంటే ఆంధ్రప్రదేశ్ కీలకం – ఏపీ వంటి కీలక ప్రాంతానికి కేంద్రం చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది – విభజన సమయంలో వెంకయ్య, గడ్కరీ మనకు ఎంతో సాయం అందించారు – రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా వెంకయ్య రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు – జాతీయ జల రవాణా మార్గాల్లో మొదటి ప్రాజెక్టు ముక్త్యాల నుంచి విజయవాడ వరకూ నిర్మిస్తున్నాం – రాష్ట్రంలో ఉన్న వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది – ఏదైనా ప్రాజెక్టు అనుకుంటే అది పూర్తయ్యేవరకు వదిలిపెట్టని వ్యక్తి గడ్కరీ – రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తయారుచేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి – కాకినాడ-పాండిచ్చేరి జలరవాణా మార్గం ద్వారా చౌక రవాణాకు ఆస్కారం – కాలుష్య రహిత రవాణాకు కూడా వీలు కలుగుతుంది – చెన్నై నుంచి కోల్ కత వరకు రవాణాకు అనుకూలంగా ఉంటుంది – రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా వెంకయ్య రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములయ్యారు : సీఎం చంద్రబాబు నాయుడు