రాష్ట్రపతి చేతుల మీదుగా షిర్డీ ఎయిర్‌పోర్టు ప్రారంభం…రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ షిర్డీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం (అక్టోబర్-1) ప్రారంభించారు. షిర్డీ నుంచి ముంబైకి ఏలియన్స్ ఎయిర్ విమానాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు రాష్ట్రపతి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం షిర్టీ సాయిబాబాకు రాష్ర్టపతి ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబా సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు కోవింద్. అనంతరం షిర్డీ సాయిబాబా సెంటినరీ సెలబ్రేషన్స్ ను రాష్ర్టపతి ప్రారంభించారు