VIZAGVISION:Nifty Labs Godowns Fire Accident,Ibrahimpatnam,Krishna Dist…కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి ఐడీఏ లోని నిఫ్టీ లాబ్స్ గోడౌన్లో అగ్నిప్రమాదం, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు, పొగ….మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. క్రమేపి అదుపులోకి వస్తూ, క్రమంగా మరల చలరేగుతున్న మంటలు.
నిర్లక్ష్యం ఎవరిదైనా కానీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలానికి 300 మీటర్ల దూరంలో హెచ్ పి సి ఎల్ గ్యాస్ బాటిలింగ్ ప్లాంట్ ఉంది. ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. గతంలో కూడా ఇక్కడ పలుసార్లు ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. నిఫ్టీ లాబ్స్ కు చెందిన షెడ్ లో నిల్వ చేసిన కెమికల్స్, లిక్విడ్స్ , సాల్యేంట్స్ డ్రమ్ములకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. గాలిలో మంటల నుండి వెలువడుతున్న వ్యర్ధ వాయువులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయు. ప్రాణ నష్టం లేదని, మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తేకానీ ఆస్తి నష్టాన్ని అంచనా వేయలేమని నిఫ్టీ లాబ్స్ యాజమాన్యం చెప్పినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు . అదుపులోకి వస్తున్న మంటలు. అగ్నిప్రమాదంపై మంత్రి ఉమ ఆరా… అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఉమ, ఎంత ఆస్తినష్టం జరిగిందో అంచనా వేయనున్నారు.