విశాఖలో ఘనంగా డా. బీఆర్ అంబేద్గర్ 132వ జయంతి వేడుకలు Vizag vision
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలను విశాఖపట్నం పోర్టు అధారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అంబేద్గర్ జయంతిని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా కాన్వెంట్ కూడలి వద్ద నున్న అంబెద్గర్ విగ్రహానికి పూలమాలలు వేసి పోర్టు చైర్మన్, ఉన్నతాధికారులు ఉద్యోగులు, పోర్ట్ ఎస్సీ ఎస్టీ అధికారులు మరియు ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పోర్టు చైర్మన్ శ్రీ టి.కె.రామచంద్రన్ , ఐఏఎస్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవను కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రపంచంలోనీ ఏ రాజ్యాంగం సరి తూగదని కితాబునిచ్చారు. ఈ ఏడాది అంబేద్గర్ జయంతిని అజాదిగా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించడం గర్వంగా ఉంది. అంబెద్గర్ ఆశయాలను ముందు తరాలకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.
అనంతరం పోర్టు పరిపాలనా విభాగంలోని బోర్డ్ రూంలో అంబెద్గర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి మరో మారు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమాన్ని పోర్టు ఎస్సీ ఎస్టీ అధికారులు సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘం సంయుక్తంగా నిర్వహించాయి. పోర్టు ఎస్సీ ఎస్టీ అధికారులు సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దేవేశ్వరరావు మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ ఎల్ బి అప్పన్నలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్మన్ శ్రీ దుర్గేష్ కుమార్ దూబె, చీఫ్ విజిలెన్స్ పిఎస్ ఎల్. స్వామి మరియు పోర్టు విభాగాధిపతులు పాల్గొన్నారు.
*********