VIZAGVISION:Swachh Bharat Abhiyan is doing well in Port Trust Plantation,VISAKHAPATNAM…విశాఖపట్నం పోర్టు ట్రస్టులో స్వచ్చ భారత్ అభియాన్ ఘనంగా సాగుతోంది. స్వచ్చతా అభియాన్ లో భాగంగా పోర్టు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు సమీపంలో ఎన్ ఎండిసి వెనకవైపు రైల్వే ట్రాక్ పక్కగా మొక్కలను నాటారు. పోర్టు ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా స్వచ్చతా అభియాన్ నిర్వహించే 15 రోజుల్లో సుమారు 1000 మొక్కలు పోర్టు పరిసరాల్లో వివిధప్రాంతాల్లో నాటేందుకు ఇంజనీరింగ్ విభాగం శ్రీకాram చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సుమారు 200 పైగా మొక్కలను నాటారు. పోర్టు డిప్యూటి చైర్మన్ హరనాధ్ గారు, పోర్టు సెక్రెటరి, చీఫ్ ఇంజనీర్, డిపార్ట్ మెంట్ హెచ్ ఓ డిలు ఇతర ఉన్నతాధికారులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ ఎండిసికి వెనకవైపు చెట్లు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ చైర్మన్ ప్రారంభించారు. పోర్టు పరిసరాల్లో పచ్చదనాన్ని అభివృద్ది చేయడంలో భాగంగా స్వచ్చతా అభియాన్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు వివరించారు.
మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పోర్టులో వివిధవిభాగాల్లో స్వచ్చ భారత్ అభియాన్ ను నిర్వహించారు. శాలిగ్రామ్ పురంలో శానిటరి సిబ్బంది శ్రీ శారదా మహిళా సమాఖ్య అధ్వర్యంలో స్వచ్చతా అభియాన్ నిర్వహించారు. ఫిష్షింగ్ హార్బర్, ఈక్యూ 7 బెర్త్ పరిసరాల్లో ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిబ్బంది స్వచ్చ భారత్ అభియాన్ ను నిర్వహించారు.