శ్రీ మురళి, రచితారామ్ జంటగా ధర్మశ్రీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ధర్మశ్రీ మంజునాథ్.ఎన్ నిర్మించిన `రథావరం`. ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగులో విడుదలైంది. కానీ, పెద్ద సినిమాలు విడుదల కావడంతో డిస్ర్టిబ్యూటర్స్ అనుకున్న థియేటర్స్ లో సినిమాను విడుదల చేయలేక పోయారు.దీంతో చిత్ర నిర్మాత ధర్మశ్రీ మంజునాథ్ .ఎన్ `రథావరం` చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మంజునాథ్. ఎన్ మాట్లాడుతూ….“కన్నడలో భారీ బడ్జెట్ తో రూపొందిచిన చిత్రం రథావరం. అక్కడ భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. కొత్త కాన్సెప్ట్స్ తో రూపొందే చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు మా చిత్రాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఎక్కడా రాజీ పడకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తెలుగులోకి అనువదించి సెప్టెంబర్ 1న విడుదల చేశాం. తెలుగులో మంచి రివ్యూలు రాబట్టుకున్నప్పటికీ అదే రోజున పెద్ద చిత్రాలు విడుదలవడంతో డిస్ర్టిబ్యూటర్స్ మాకు ముందుగా అనుకున్న థియేటర్స్ సమకూర్చలేకపోయారు. దీంతో ఆ ఒక్కరోజు మాత్రమే ప్రదర్శించాం. దీంతో మళ్లీ వేరే డిస్ర్టిబ్యూటర్స్ ని సంప్రదించి వారి సూచన ప్రకారం పెద్ద సినిమాలు రిలీజ్ లేని సమయం చూసుకుని త్వరలో రథావరం చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.