ప్రముఖ న్యాయవాది, సీనియర్ బీజేపీ నేత రామ్‌జెఠ్మలానీ (94) న్యాయవాద వృత్తికి వీడ్కోలు పలికారు. సుమారు 7 దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగిన జెఠ్మలానీ పలు చారిత్రాత్మక కేసులను వాదించి గుర్తింపు పొందారు. శనివారం న్యాయవాద వృత్తికి రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. ఇకపై నన్ను కొత్త పాత్రలో చూస్తారని చెప్పారు.
భవిష్యత్‌లో అవినీతి పరులైన రాజకీయ నేతలపై పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దేశాన్ని దుర్భరస్థితిలోకి నెట్టాయని జెఠ్మలానీ చెప్పారు. కాంగ్రేస్ నేతృత్వంలోని యూపీఏతో పోలిస్తే.. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ దేశాన్ని మరింత పతనం దిశగా నడిపిస్తోందని అన్నారు.