జననాలు
1895: విశ్వనాథ సత్యనారాయణ “కవి సమ్రాట్”, తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.
1905: ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు.
1912: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి.
1920: కల్యంపూడి రాధాకృష్ణ రావు, ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు మరియు గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు.
1921: వడ్డాది పాపయ్య, ప్రముఖ చిత్రకారుడు.
1922: యలవర్తి నాయుడమ్మ, ప్రముఖ చర్మ సాంకేతిక శాస్త్రవేత్త.
1935: జి. వి. సుబ్రహ్మణ్యం, సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి.
1935: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త.
1972: అనురాగ్ కశ్యప్, భారతీయ చిత్ర దర్శకుడు మరియు చిత్ర రచయిత.
1984: చిన్మయి, భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి.
మరణాలు
1944: సర్దార్ దండు నారాయణ రాజు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.
1985: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (పాలకుర్తి గ్రామం ,జనగామ జిల్లా వాస్తవ్యులు.)
2001: పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు
పండుగలు మరియు జాతీయ దినాలు
హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం