పిట్ట కొంచెం.. కూత ఘనం అనే నానుడి ఇలాంటి వారిని చూసే వచ్చిందేమో అనిపిస్తోంది.
- ఎంతో కష్టపడితే గానీ రికార్డులు సొంతం కావు.. కానీ నాలుగేళ్ల పసిప్రాయంలోనే ఓ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది.
- చిన్నారి యోగాశ్రితను అభినందించిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు.
- ఇంతకు ఆ పాప ఏం చేసిందంటే..

★ గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటకు చెందిన చిన్నారి కనుమూరి యోగాశ్రిత అరుదైన రికార్డు సాధించింది.
★ నాలుగేళ్ల పసిప్రాయంలోనే 33 నదుల పేర్లు తక్కువ సమయంలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకుంది.
★ అరుదైన ఘనత సాధించిన చిన్నారి యోగాశ్రితను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు.
★ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆశీర్వదించారు.

















