దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను మూసి వేయాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు జాతీయ రహదారుల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి సూచనప్రాయంగా వెల్లడించారు…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు.. దేశ వ్యాప్తంగా 434 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ ప్లాజాల్లో వాహనానికి అనుగుణంగా ఫీజును వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు చెన్నై నుంచి కన్యాకుమారికి ఒక కారు వెళ్ళాలంటే ఏకంగా 1500 రూపాయలను టోల్ ఫీజుగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది….
అంటే టోల్ ప్లాజాల్లో వాహనచోదకులను నిలువుదోపిడీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది….
ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రకటించిన తన ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాను మూసివేస్తామని హామీ ఇచ్చింది. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తిఅయినప్పటికీ ఈ హామీని నెరవేర్చలేదు??