ఓ మహిళ 70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్‌లో చోటు చేసుకుంది. జివెబెన్ వాలాభాయ్ రబరి అనే వృద్ధురాలు.. తొలిసారి ఓ బిడ్డకు జన్మనిచ్చి తన కోరికను నెరవేర్చుకుంది. జివెబెన్కు పెళ్లయి 45 ఏళ్లు. అప్పటి నుంచి పిల్లలు లేరు. ఇక.. తమకు పిల్లలు పుట్టరని జివెబెన్, తన భర్త వాలిభాయ్ అనుకున్నారు.

పిల్లల కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగారు కానీ.. పిల్లలు పుట్టలేదు. దీంతో తమకు దేవుడు ఆ అదృష్టం ఇవ్వలేదని అనుకొని తమలో తామే బాధపడుతూ వచ్చారు. కానీ.. చివరకు తన 70 ఏళ్ల వయసులో తనకు పెళ్లి అయిన 45 ఏళ్ల తర్వాత వాలాభాయ్.. పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కొడుకుకు జన్మనిచ్చిన అత్యంత ఎక్కువ వయసు గల మహిళగా వాలాభాయ్ చరిత్రకెక్కింది.
ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలను కనొచ్చని తెలుసుకున్న వాలాభాయ్ ఏమాత్రం ఆలోచించకుండా.. ఆ వయసులో పిల్లలను కనడం రిస్క్ అని తెలిసినా కూడా పిల్లలను కనాలనే తన కోరికను ఈ వయసులో తీర్చుకుంది బామ్మ. తమకు ఈ వయసులో పుట్టిన కొడుకుకు లాలో అనే పేరు పెట్టుకొని ఆ దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.















