VIZAGVISION:khairatabad ganesh || nimajjanam 2017 || Hyderabad..పదకొండు రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ శ్రీ చండీకుమార అంతనపద్మనాభ మహాగణపతి గంగఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు.
మంగళవారం ఉదయం భాజాభజంత్రీల మధ్య ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది..
వెల్డింగ్ పనులు పూర్తి అయిన వెంటనే ఉదయం స్వామికి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.
ఖైరతాబాద్ నుంచి మొదలైన ఈ శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ చేరుకుని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ వద్ద నిమజ్జనంకానున్నాడు.
ఈరోజు మధ్యాహ్నం వరకు భారీ గణనాథుడి నిమజ్జనం పూర్తి చేసేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.