డియర్ మేఘ చిత్ర యూనిట్ సందడి

ప్రేమ కధాంశం తో నిర్మితమైన
“డియర్ మేఘ” చిత్రం ను ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర ఆదిత్ అరుణ్, కోరారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా బుధవారం సాయంత్రం జగదాంబ దరి కెఎల్ఎం ఫ్యాషన్ మాల్ కు విచ్చేశారు. కెఎల్ఎం ఫ్యాషన్ మాల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో అదిత్ అరుణ్ మాట్లాడుతూ ఒక వినూత్న మైన, స్వచ్చమైన ప్రేమ కధాంశం గా డియర్ మేఘ రూపొందింది అన్నారు. ఆది అనే మంచి పాజిటివ్ క్యారెక్టర్ తాను నటించానని చెప్పారు. తాను విశాఖ లో ఏయూ లో చదివాను, ఇక్కడ పరిసరాలు తనకు ఎంతో ఇష్టమన్నారు. విశాఖ లో సినీ ప్రేమికులు ఎక్కువ అందుకే ఇక్కడ ప్రమోషన్ చేశామన్నారు. చిత్ర హీరోయిన్ మేఘ ఆకాష్ మాట్లాడుతూ తాను పేరు ఈ చిత్రం కు టైటిల్ కావడం గొప్ప అనుభూతి ఇచ్చింది అన్నారు.
తన కెరీర్ లో ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ చిత్రంలోని పాటలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం కు ప్రమోషన్ ఇవ్వడం ఎంతో ప్లస్ అయ్యింది అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. చిత్ర దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ తమ చిత్ర ట్రైలర్ కు విపరీతమైన స్పందన లభించిందని అన్నివర్గాలకు ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. గోవాలో కొత్త లొకేషన్ లలో రిస్క్ చేసి షూట్ చేశామన్నారు. వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మిచిన ఈ చిత్రానికి హరి గౌర సంగీతం సమకూర్చగా, ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ చేసారని తెలిపారు. డియర్ మేఘన చిత్రం తప్పకుండా విజయవంతం చేయాలని కోరారు.