VIZAGVISION:Attack on Media in Guntur,Visakhapatnam…మంత్రి భూమా అఖిలప్రియ, ఎంఎల్ఏ బ్రాహ్మానంద రెడ్డి సమక్షంలో టీడీపీ కార్యకర్తులు మీడియాపై దాడులకు దిగారు. గుంటూరు డొంకరోడ్డులో ఉంటున్న తమ కుటుంబ మిత్రులను కలుసుకోవడానికి మంత్రి వచ్చారు. ఆ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి స్వాగతం పలికారు. మిత్రుతలతో మాట్లాడి అనంతరం వినాయక వినాయక మండపంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అఖిల ప్రియా. మీడయాతో మాట్లాడటానికి సిద్ద మైన సదర్భంలో కొందరు కార్యకర్తలు కావాలని కెమేరామెన్ లను తోయడంతో గొడవ ప్రారంభమైది. వాయిస్ తీసుకుంటున్నాం కొద్ది సేపు సంయమనం పాటించండి అని కెమేరమెన్లు విన్నపాలు చేసిన పట్టించుకో లేదు. కెమారలాను తోయడంతో దయచేసి మీడియా వారికి సమకరించడి అని చెప్పిన ఎవరు మీడియా రా… మీడియా అయితే ఎంటిరా అంటూ వెనుక నుంచి పిడిగుద్దులు కురిపించారు. అసలు మిమ్మలను ఎవరు రమ్మన్నారు అంటూ అసబ్య పదజాలంతో దూషించారు. మంత్రి సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వినుపించుకోక పోవడంతో ఆమె కారు ఎక్కారు. కెమారామెన్లు, రిపోర్టర్లు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ చిట్టిబాబును దాడులు జరుగుతున్నాయి మీరు పట్టించుకోవడంలోదని అడుగగా. వారు ఎవరో తనకు ఏమి తెలుసునని ఏమి చెప్పమంటారని సెలవిచ్చారు. కార్యకర్తల అరాచకం శ్రుతి మించడంతో మంత్రి కారుదిగి వారిని సర్థి చెప్పి మీడియా వారిని కన్వియన్స్ చేయాలని ప్రయత్నించారు. కాని అహంకార పూరితంగా అసబ్యపదజాలంతో మీడియను మాట్లడుతూ కార్యకర్తలు హల్ చెల్ చేయడం వారిని సర్థి చెప్పవలసిన మీడియా కోర్డినేటర్ చిట్టిబాబు చేతులెత్తయేడం తో అవమానంగా భావించి మంత్రి అఖిల ప్రియ ప్రస్ మీట్ ను మీడియా సభ్యులు బాయకట్ చేసారు.