గిరిజనులకు సాయం అందిద్దాం Medical Kits for Tribals in Araku and Padedi Region Visakhapatnam Vizagvision గిరిజనులకు సాయం అందిద్దాం …. ఉత్తర అమెరికాలో కోమటి జయరాం మరియు గోకుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన్మభూమి అనే స్వచ్చంద సంస్థ నిధులు సమీకరించి ఆంధ్ర రాష్ట్రం లో గౌతు లచ్చన్న బలహీన వర్గాలు సంస్థ మరియు స్నేహ సంధ్య సంస్థ ల ద్వారా పలు కోవిడ్ విముక్తి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గౌతు బలహీన వర్గాల కార్యదర్శి వెంకన్న చౌదరి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్యం కల్పించడం కోసం కోవిడ్ నుంచి రక్షణ కల్పించె ప్రాధమిక మందులు,పల్స్ ఆక్సిమిటర్లు,ఆక్సిజన్ కాంసెంట్రేటర్స్ పంచుతున్నామన్నారు.స్నేహ సంధ్య చైర్మన్ శ్రావణ్ షిప్పింగ్ సాంబశివరావు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య వసతులు ఉన్నట్లే గిరిజన ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాధి నివారణకు అందరం నడుం కట్టి సరైన కార్యక్రమాలు అమలు చేద్దామని అందుకు ముందుకు వచ్చిన వనవాసి కళ్యాణ్ ఆశ్రమం సంస్థ కు ధన్యవాదములు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో NS రాజు , సుభద్ర రావు,సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/