విశాఖపట్నం : విదేశాలలో విద్యాభ్యాసం చేయాలని కోరుకుంటున్న వారి డిమాండ్‌కు అనుగుణంగా, విశాఖపట్నంలో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (అటానమస్)లో పిటిఇ అకాడమిక్ టెస్ట్ (Pearson Test of English) నిర్వహించేందుకు కొత్త పిటిఇ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని, ప్రపంచంలోని అగ్రగామి ప్రముఖ అభ్యాస సంస్థ పియర్సన్ నేడు ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన సురక్షిత చర్యలు, మెరుగైన అందుబాటుతో, విదేశాల్లో చదువు మరియు పని చేసేందుకు కావలసిన ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష రాసే వారికి వేగవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షిత మరియు నిష్పాక్షికమైన సదుపాయాలు కల్పిస్తోంది.పిటిఇ (PTE) అకాడమిక్ అనేది కంప్యూటర్ ఆధారిత భాషా పరీక్ష కాగా, అత్యంత కచ్చితమైన మరియు నిష్పాక్షిక స్కోరింగ్ ఫలితాలను అందిస్తుండడంతో, ఇది అపారమైన ప్రజాదరణ పొందింది. ప్రామాణికమైన టెస్ట్ స్కోరు అందించేందుకు, అన్ని పిటిఇ కేంద్రాల్లో డిజిటల్ బయోమెట్రిక్స్, అరచేతుల- స్కానింగ్, సురక్షితమైన పేపర్ లెస్ ఫలితాలు, రాండమైజ్డ్ టెస్ట్ ఫార్మాట్లు మరియు సిసి టివి వంటి అత్యాధునిక మరియు
పరిశ్రమలో- ప్రముఖ భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. దీనితో, పరీక్షకు హాజరయ్యే ఔత్సాహికులు నియంత్రిత మరియు సురక్షిత వాతావరణంలో పరీక్ష రాసే హామీ లభిస్తుంది.
కొత్త కేంద్రాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో పియర్సన్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు ఎస్.జి.రమానంద మాట్లాడుతూ ‘‘విదేశాల్లో విద్యాభ్యాసానికి భారతదేశ విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తుండగా, ఏటా వీరి సంఖ్య వృద్ధి చెందుతూనే వస్తోంది. . పియర్సన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, వేగవంతమైన మరియు విశ్వసనీయమైన ఆంగ్ల భాషా ప్రావీణ్యత పరీక్షతో భారతదేశం అంతటా పిటిఇ అకాడమిక్ సెంటర్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

















