VIZAGVISION:With in 24hrs Rains in Telugu States.Visakhapatnam..ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఆవరించింది. ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు ఒంగి ఉండడంతో తెలంగాణ, కోస్తాపై ప్రభావం చూపే అవకాశముందని, వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.