కరోనా అనంతరం సింహాచలంలో మొదటి ఉత్సవం అప్పన్న స్వామి తెప్పోత్సవం.. సుమారు సంవత్సరం తర్వాత స్వామి వారి కొండ దిగున ఉత్సవం ఏర్పాటు చేశారు.. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచల శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారి తెప్పోత్సవం గురువారం వరహా పుష్కరణిలో వైభవంగా జరిగింది .వేణుగోపాలస్వామి అలంకరణలో అప్పన్నస్వామి ఉభయదేవేరులతో హంసవాహంపై విహరించారు .ప్రతి ఏటా బహుళపుష్య అమావాస్యరోజు జరిపే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు . స్వామివారిని సాయంసంధ్యవేళ సింహగిరిపైనుండి పల్లకిలో పుష్కరణివద్దకు మంగళవాయిద్యాల నడుమ తీసుకువచ్చారు .ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహంపై ఆశీనులను గావించి మూడు సార్లు విహరింపజేసి పుష్కరిణి మద్యలోవున్న మండంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం స్వామివారు తిరిగి వస్తుండగా భక్తులహరినామ స్మరణలతో పుష్కరిణి పరిసరప్రాంతాలు మారుమ్రోగాయి . ఉత్సవం అనంతరం స్వామివారిని సర్వజనమనోరంజని వాహంపై మూఢ వీధులులలో తిరువీధి నిర్వహించారు “Simhadri Appanna Swamy Theppotsavam” Sri Varaha Lakshmi Narusimha SwamySimachalam Visakhapatnam Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/