పరిటాల కుటుంబం లో పెళ్లి సందడి మొదలైంది. దివంగత పరిటాల రవి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం అక్టోబరు 1న జరగనుంది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలం కు చెందిన ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానతో పెళ్లి నిశ్చయమైంది.ఈ నెల 10న హైదరాబాదులో నిశ్చితార్థం నిర్వహిస్తున్నారు.ఈ మేరకు మంత్రి సునీత ఈరోజు ఉఅదయం ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఆహ్వానించారు.వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.. హైదరాబాద్ N కన్వెన్షన్ లో పరిటాల శ్రీరామ్ నిశ్చితార్ధం జరగనుంది.