VIZAGVISION:TU-142M Navy Aircraft Museum at Beach Road,Visakhapatnam…భూగోళం మొత్తాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే చుట్టి వచ్చేస్తుంది..18 గంటలపాటు నిరంతరంగా గగన విహారం చేస్తుంది..గాలిలోనే ఇంధనం నింపుకుంటుంది..గంటకు 850 కిలోమీటర్ల వేగంతో సముద్రాన్ని జల్లెడ పట్టేస్తుంది.ఇన్ని ప్రత్యేకతలతో శత్రు దేశాల నుంచి మనల్ని రక్షిస్తూ 29 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలందించిన యుద్ధవిమానం ఇప్పుడు మన మహా విశాఖ నగరంలో సాగరానికి, జలాంతర్గామికి అభిముఖంగా కొలువుదీరుతోంది.టీయూ 142 యుద్ధ విమానం గురించి రక్షణ రంగంలోని వారికి, కొంతమంది మేధావులకు తెలుసు. కానీ ప్రజలందరికి ఇది తెలియజేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఒక మ్యూజియంగా మార్చాలని భావించింది. ఇప్పటికే జలాంతర్గామి పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనికి అభిముఖంగా ఏర్పాటు కావడం యాదృచ్ఛికమైనా.. బహుశా ఆసియా ఖండంలోనే ఇది తొలి ప్రాంతం కావడం గర్వకారణం. ఈ మ్యూజియంతో విశాఖ రామకృష్ణ బీచ్‌రోడ్ మరింత చరిత్రాత్మకం కానుంది. టీయూ 142 యుద్ధ విమానానికి ముందు దీనిస్థానంలో యూకే తయారు చేసిన సూపర్ కన్స్టిలేషన్ యుద్ధ విమానం సేవలందించింది. 1980 దశకంలో అప్పటి యుఎస్ఎస్ఆర్ తయారు చేసిన టీయూ 142 యుద్ధ విమానం ఈ స్థానాన్ని భర్తీ చేసింది. ప్రస్తుతం టీయూ 142 యుద్ధ విమానాన్ని గత మార్చిలో డికమిషన్ చేశారు. దీని స్థానంలో రష్యా తయారు చేసిన పి8ఐ యుద్ధ విమానం సేవలందిస్తోంది. టీయూ 142 మన దేశానికి వచ్చాక అందులోని పలు విభాగాలను ఆధునికీకరించారు.ఇదే ఎయిర్‌క్రాఫ్ట్‌పై 15 ఏళ్లు పనిచేశాను. దేశ రక్షణ వ్యవస్థలో ఈ విమానం అందించిన సేవలు వెలకట్టలేనివి.దేశంలోపల మనం సురక్షితంగా, ఆనందంగా ఉండగలుగుతున్నామంటే ఇటువంటి సేవల వల్లే సాధ్యమవుతుంది యుద్ద విమానాంతో తనకున్న అనుభూతిని పంచుకున్నారు కమాండర్స్…
బైట్:కమాండర్
దేశరక్షణలో సేవలందించిన టీయూ 142 యుద్ధ విమానం మ్యూజియంగా కొలువుదీరుతున్నప్పటికీ అత్యంత గౌరవం పొందాల్సిన విమానం కూడాను. దీని ద్వారా అందిన సేవలను భారతజాతికి తెలియజేసేందుకు లైట్, సౌండ్స్ ప్రదర్శనను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విడగొట్టి తిరిగి అమర్చడం.. సాధారణంగా యుద్ధ విమానాలను తయారీ పరిశ్రమల వద్ద అమర్చడం, విప్పడం జరుగుతుంటాయి. కానీ ఈ యుద్ధ విమానాన్ని విడిభాగాలుగా చేసి మరో చోటుకు తరలించి తిరిగి అమర్చడం భారతదేశంలోనే తొలిసారిగా విశాఖ లో జరుగుతున్న ప్రక్రియ. పైగా 29 ఏళ్ల పాటు మన దేశ రక్షణ వ్యవస్థలో కీలక భూమిక పోషించి వందశాతం విజయాలతో ఖ్యాతి గాంచిన టీయూ 142 యుద్ధ విమానాన్ని విడగొట్టి నేడు బీచ్‌రోడ్‌లో అమరుస్తున్నారు. దీనిని తనేజ ఏవియేషన్, ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థలో కొందరు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్లు సైతం ఇదే యుద్ధ విమానంపై రెండేసి దశాబ్దాలు పనిచేసిన విశ్రాంత సైనికులు కావడం మరో విశేషం.మెుత్తం మీద యుద్ద విమానం మ్యూజియంగా మారడంతో నగర వాసులు అసక్తిగా ఎదురు చుస్తున్నారు…