వసతులు కల్పన పేరుతో ఆర్టీసీ స్థలం ప్రైవేటు వారికి కట్టబెట్టడం అన్యాయం Dharna in Visakhapatnam,Vizagvision…విశాఖ నగర పరిధి మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా పీపీపీ పద్దతిలో ప్రైవేటు నిర్మాణ సంస్థలకు అప్పజెప్పాలన్న వైస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోందని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.
మద్దిలపాలెం ఆర్టీసీ స్థలం ప్రైవేటు వ్యక్తులకు 33 సంవత్సరాలకు లీజుకు ఇవ్వాలన్న వైస్సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విశాఖ నగర నడివడ్డున కోట్లాది రూపాయలు విలువచేసే ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని పీపీపీ పద్దతిలో ప్రైవేటు వారికి కేటాయించాలని ప్రభుత్వం భావించడం సరైన నిర్ణయం కాదని విమర్శించారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే నిర్మాణాలు చేయాల్సింది పోగా ఇలా ప్రైవేటు వారికి కేటాయిస్తే వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలదని ఆయన ప్రశ్నించారు.వైస్సార్ ప్రభుత్వ పాలనలో కోట్లాది రూపాయలు విలువు చేసే ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పీపీపీ పద్దతిలో నిర్మాణాలు చేపట్టడం వెనుక భారీ కుట్రకోణం దాగివుందని పేర్కొంటూ ఇంత ఖరీదైన భూములను లీజు పేరుతో ప్రైవేటు వారికీ కేటాహిస్తే తిరిగీ ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే ఆవకాశం ఉంటుందా అని ప్రశ్నించ్చారు.విశాఖ జిల్లా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన 7 ఆర్టీసీ కాంప్లెక్స్ లను ప్రైవేటు వారికి అప్పజెపాలన్న వైస్సార్ ప్రభుత్వ తీరుపై దశలవారీగా ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆయన ఎచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు,జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు ఎ విమల, ఎస్ కె రెహమాన్, జి రాంబాబు, కె సత్యనారాయణ, పి ఈశ్వరరావు, జి వామనమూర్తి,పి చంద్రశేఖర్, పి గోవింద్, దేవుడమ్మ, కె లక్ష్మణరావు, టి వి రావు తదితరులు పాల్గొన్నారు