District Collector V Vinaychand Press Briefing on COVID-19 at VUDA Arena in Visakhapatnam,Vizagvision జిల్లాలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాధి వ్యాప్తి అరి కట్టేందుకు సమగ్ర, వికేంద్రీకరణ విధానాన్ని అనుసరించడానికి జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేసారు.
పట్టణ ప్రాంతాలలో జి.వియం.సి.కమిషనర్, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపల్ కమిషనర్లు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించవలసి ఉంటుందని తెలిపారు.
ప్రాధమిక స్థాయిలో ట్రేసింగ్ చేయడానికి వార్డు సచివాలయం “ప్రైమరీ హెల్త్, సర్వైలెన్సు టీమ్” (పి.హెచ్ .ఎస్ టి ) గా వ్యవహరిస్తుందని తెలిపారు.
సెకండరీ స్థాయిలో టెస్టింగ్ చేయడానికి జి.వి.యం .సి.లో ఒక వార్డు, మునిసిపాలిటీలలో 3 వార్డులు “సెకండరీ హెల్త్ , సర్వైలెన్సు టీమ్” గా వ్యవహరిస్తుందని తెలిపారు.
టెర్షరీ స్థాయిలో ట్రీట్ మెంట్ చేయడానికి కార్పోరేషన్, మునిసిపాలిటి “టెర్షరీ హెల్త్, సర్త్వెలెన్సు టీమ్” గా వ్యవహరిస్తారని తెలిపారు. జి.వి.యం.సి. కమీషనర్, మున్సిపల్ కమీషనర్లు ప్రతి స్థాయిలోను సమావేశాలు జరిపి, సంబందిత అధికారులకు శిక్షణ ఇప్పించి, అవగాహన కల్పించాలని తెలిపారు.
ట్రేసింగ్ స్థాయిలో వార్డు పరిపాలనా కార్యదర్శి ఆధ్వర్యంలో కంటైన్మంట్ జోన్లలో ఫీవర్ క్లినిక్ లను నెలకొల్పుతారు. వార్డు ఆరోగ్య కార్యదర్శి, శానిటేషన్ కార్యదర్శి, ఎ.ఎన్.ఎం, ఆశా కార్యకర్త, సంబంధిత వాలంటీర్, యుసిడి, మెప్మా రిసోర్స్ పర్సన్ లు కంటైన్మంట్ జోన్లలో ఎన్హన్స్డ్ యాక్టివ్ సర్త్వెలెన్సు (ESA) కార్యక్రమం క్రింద, హై రిస్క్ వ్యక్తులు(HRP) గా గుర్తించబడిన 60 సంవత్సరములు దాటిన వ్యక్తులకు, 40 సం.ల పై బడి బి.పి, డయాబెటిక్, ఆస్తమా, టి.బి, కాన్సర్, లివర్, కిడ్ని వ్యాధులు, సి.ఓ.పి.డి, ఆవయవాలు మార్పిడి చేయించుకున్న వ్యక్తులు, హెచ్.ఐ.వి., ఎయిడ్స్ లకు చికిత్స పొందుతున్న వ్యక్తులు, గర్బిణీ స్త్రీలు, 10 సంవత్సరాలలోపు పిల్లలు, జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వ్యక్తులను ఇంటింటికి తిరిగి గుర్తించాలి.
కాంటాక్ట్ ట్రేసింగ్ లో పాజిటివ్ వ్యక్తులుగా గుర్తించబడిన వ్యక్తుల ప్రాధమిక, సెకండరి కాంటాక్టులను వి.ఆర్.ఓ, మహిళా పోలిస్, వాలంటీర్ లు గుర్తించాలి .
డేటాను ఎప్పటికపుడు వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రొసెసింగ్ కార్యదర్శి యం.ఎస్.ఎస్. మరియు సి.ఎం.ఎస్. పోర్టల్ లకు అప్ లోడ్ చేయించాలి .
వార్డు శానిటేషన్ కార్యదర్శి హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించడంతో పాటు, శానిటేషన్ పై బాధ్యత వహించాలి.
కంటైన్మంట్ పరిధిలోని షాపులు, సంస్థల మూసివేత, రాకపోకల నియంత్రణను వార్డు పరిపాలన కార్యదర్శి పర్యవేక్షిస్తారు. వార్డు సంక్షేమ, అభివృద్ది కార్యదర్శి కంటైన్మంట్ క్లస్టర్ లలో మొబైల్ వ్యాన్, ఆటోరిక్షా ద్వారా నివారణ చర్యలు, జాగ్రత్తలపై ప్రచారం చేయించాలి .
పాజిటివ్ కేసును గుర్తించిన 2 గంటలలో కోవిడ్ కేర్ సెంటర్, ఐసోలేషన్ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. సెకండరి కాంటాక్టులను హోమ్ క్వారంటైన్ లో ఉంచి, ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని వార్డు ఆరోగ్య కార్యదర్శి, ఆశా కార్యకర్తలు నమోదు చేయాలి . కంటైన్మంట్ క్లస్టర్ల లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ను ఫీవర్ క్లీనిక్ గా నిర్వహిస్తారు. లేదా క్లస్టర్ లోని ప్రవేట్ క్లినిక్, ఆసుపత్రిలో శ్యాంపిల్ లను సేకరిస్తారు. ఈ సౌకర్యాలు లేని సందర్భంలో 104 వాహనాలను కూడా ఫీవర్ క్లీనిక్ లుగా ఉపయోగిస్తారు.
పాజిటివ్ కేసును గుర్తించిన 12 నుంచి 16 గంటలలోగా మొదటి రౌండ్ సర్త్వెలెన్స్ ప్రారంభించి 48 గంటలలోగా పూర్తి చేయాలని తెలిపారు. రెండు రోజుల తర్వాత రెండవ రౌండ్ సర్త్వె లెన్స్ నిర్వహిస్తారు .
పల్స్ ఆక్సీమీటర్లు, క్లినికల్ ఇన్ ఫ్రారెడ్ ధర్మామీటర్లు ఉపయోగించి హైరిస్క్ వ్యక్తులను స్క్రీనింగ్ చేయాలి .
సెకండరీ స్థాయిలో ఎన్.హెచ్.ఎస్.టి.లు హై రిస్క్ వ్యక్తులను శత శాతం పరీక్షలు నిర్వహించాలి. జి.వి.ఎం.సి. పరిధిలో ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్లు ద్వారా లేదా ట్రూనాట్ టెస్టింగ్ చేయించాలి .
పాజిటివ్ ఫలితం వచ్చిన ఎసిమ్టామేటిక్ వ్యక్తికి, ఇతర వ్యాధులు లేనట్లయితే హోం ఐసోలేషన్ కు అనుమతిస్తారు. అత్యవసర సమయంలో సంప్రదించడానికి జి.వి.ఎం.సి. కంట్రోలు రూము, టెలీ మెడిసిన్ సౌకర్యం, 104 వాహన ఫోన్ నెంబర్లను వారికి అందజేయాలి.
పాజిటివ్ ఫలితం వచ్చిన 60 సంవత్సరముల పై బడిన, ఇతర వ్యాధులున్న వ్యక్తులను ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలి. తక్కువ వ్యాధి తీవ్రత కలిగిన వ్యక్తులను కోవిడ్ కేర్ సెంటర్ లకు తరలించాలి.
ఎస్.హెచ్.ఎస్.టి. బృందం పాజిటివ్ వ్యక్తుల ప్రాధమిక కాంటాక్టులను క్వారంటైన్ సెంటర్ కు తరలించాలి.
టెర్షరీ స్థాయిలో టి.హెచ్ ఎస్ టి , ప్రాధమిక, సెకండరీ స్థాయి బృందాల పని తీరును పర్యవేక్షిస్తారు.
ఈ టీమ్ లో కమీషనర్, ఛీఫ్ మెడికల్ ఆఫీసర్, నియోజక వర్గ ప్రత్యేక అధికారి సభ్యులుగా ఉంటారు. 24 గంటలు పని చేసేలా కంట్రోలు రూం ను నిర్వహించాలి.
గ్రామీణ ప్రాంతంలో పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ (సచివాలయాలు – అభివృద్ది ) ఆధ్వర్యంలో డి.ఎం.హెచ్.ఓ కార్యాలయంలో కంట్రోలు రూమును నిర్వహిస్తారు.
ప్రాధమిక స్థాయిలో ట్రేసింగ్ చేయడానికి పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం పి.హెచ్.ఎస్.టి.గా వ్యవహరిస్తుంది.
సెకండరీ స్థాయిలో టెస్టింగ్ చేయడానికి యం.పి.డి.ఓ, పోలీస్, వైద్యాధికారులు ఎస్.హెచ్.ఎస్.టి.గా వ్యవహరిస్తారు.