VIZAGVISION;Blood Donation Camp by VJF & VSCVJWA.Visakhapatnam…వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ మరియు విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్స్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో
మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్వయమగా తన రక్తాన్ని దానం చేసి వీడియో జర్నలిస్ట్స్ లో స్ఫూర్తిని నింపారు అనంతరం ఆయన మాట్లాడుతూ… సామాజిక సేవ లో భాగంగా జర్నలిస్ట్స్ రక్తం దానం చేయడం అభినందనియమ్మన్నారు..
రక్త కొరత చాలా ఉంది అని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు..
గౌరవ అతిథిగా విచ్చేసిన ఏయూ ఉపకులపతి జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ..
రక్తదానం చేయడం ద్వారా నూతన రక్తం తో పాటు ఆరోగ్యం మెరుగు పడుతుంది అన్నారు..ఇప్పటివరకు 60 సార్లు రక్తదానం లో పాల్గొనటం జరిగింది అన్నారు…
విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్ట్ లు రక్తదానం చేయడం ఆనందదాయకమన్నారు
విజేఎఫ్ అనుబంధ సంస్ధ అయిన విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్స్ వెల్ఫర్ అసోసియేషన్ ద్వారా చేపట్టిన ఈ రక్తదాన శిబిరం మరి కొందరిలో స్ఫూర్తి నింపాలని ఆకాక్షించారు..
కార్యదర్శి దుర్గ రావు మాట్లాడుతూ.. జర్నలిస్ట్స్ లు వార్తాల సేకరణ , క్రీడల్లో పాల్గొనడంతో పాటు సేవ కార్యక్రమంలో కూడా పాల్గొనడం హర్షణీయం అన్నారు..వీడియో జర్నలిస్ట్స్ అధ్యక్షుడు దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ.. నిత్యం న్యూస్ కవేరేజి లో తనమునకలై రాత్రి పగలు కష్టపడే వీడియో జర్నలిస్ట్స్ లు ఇటువంటి సామాజిక సేవ కార్యక్రమలు నిర్వహిస్తూ పలువురు కి ఆదర్శంగా నిలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు..
కార్యదర్శి అమిత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమ స్ఫూర్తి తో సేవ కార్యక్రమాలు తో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని అన్నారు..
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలతో పాటు
ఏ ఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సభ్యులు వినోద్ కుమార్ , వైద్యరాలు రాధ రాణి తో పాటు విజేఎఫ్ సభ్యులు ఈశ్వర రావు ,దివాకర్ , ఫోటోగ్రాపేర్ సంఘము అధ్యక్షుడు మూర్తి ,వీడియో జర్నలిస్ట్స్ సభ్యులు గురు ప్రసాద్, సత్య ప్రసాద్ , గణేశ్వర రావు ,శంకర్ రావు , సత్య, శ్రీధర్ ,టివి 5 కిరణ్ ,వై టివి ప్రభాకర్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు..