Torrential Rains కుండపోత వర్షం – నిండుకున్న వాగులు, గెడ్డలు in Araku,Visakhapatnam,Vizagvision…
అరకు లోయ లో కుండ పోత వర్షం – నిండు కున్న వాగులు, గెడ్డలు పర్యాటక కేంద్రం మైన అరకులోయలో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి వాగులు గడ్డలు పొంగి ప్రవహించాయి.
దీంతో మారుమూల ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి విచ్చేసిన గిరిజన పనులు ముగించుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షానికి గడ్డలో పొంగి ప్రవహించడంతో సుమారు మూడు నాలుగు గంటల పాటు ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
కాగా వర్షపు నీటితో పంట పొలాలు నిండిపోవడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా అర్హులై కొద్దిపాటిగా విచ్చేస్తున్న పర్యాటకులు ఇక్కడ కురిసిన భారీ వర్షానికి ముగ్ధులయ్యారు.
మైదాన ప్రాంతంలో సూర్యభగవానుడు తన ప్రతాపం చూపిస్తూ ఉంటే అందాల అరకు లోయలో భారీ వర్షం కురవడంతమను ఎంతో ఆనందంనికి గురి చేసేదని పర్యాటకులు పేర్కొన్నారు.
















