చైనా ఉత్పత్తులు బహిష్కరిద్దాం in Anakapalle,Visakhapatnam,Vizagvision….
దేశం కోసం అమరవీరుల త్యాగం ఎనలేనిదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ , ఆర్ ఎస్ ఎస్ నాయకులు, బిజెపి నాయకులు పేర్కొన్నారు.
చైనా తో పోరాటంలో వీరమరణం పొందిన జవానులకు గురువారం నాలుగు రోడ్ల కూడలిలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గండి వెంకట సత్యన్నారాయణ రావు, కొణతాల జనార్దన్ , ఎస్ సన్యాసిబాబు లు మాట్లాడుతూ చైనా వస్తువుల్ని నిషేధించాలనారు. ప్రజలందరూ వీరజవాన్లకు బోర్డర్లో చైనాతో యుద్ధం చేస్తున్న సైనికులకు మద్దతుగా చైనా వస్తువులు నిషేధించాలని పిలుపునిచ్చారు. చైనా వస్తువులను కాకుండా భారతదేశంలో తయారవుతున్న స్వదేశీ వస్తువులు మాత్రమే వాడి దేశ సమగ్రతకు అండగా నిలవాలనారు. భారతదేశం శాంతిని కోరుకుంటుందని సహనాన్ని పరీక్షించి మితిమీరితే భారత్ ఆర్మీ శక్తి ముందు చైనా తోక ముడక తప్పదన్నారు. నాలుగు రోడ్ల కూడలిలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరులకు జోహార్లు అంటూ ప్రధాన రహదారి పై నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. పరమేశ్వరరావు, కర్రీ రామకృష్ణ, కొమోజు రమేష్, కొండబాబు, చదరం నాగేశ్వరరావు, శ్రీ రాములు, కొణతాల అప్పలరాజు, భక్త సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
















