గిరిజన ప్రజా సంఘాల జేఏసీ నిరవధిక 48 గంటల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది in Agency,Visakhapatnam,Vizagvision…గిరిజనుల హక్కుల చట్టాలు పరిరక్షణపై జీవో నెంబర్ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ గిరిజనులు నిరసన వెల్లువ తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా నేటి నుండి 48 గంటలు నిరవధిక బందును రాష్ట్ర ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ బంధు నిర్వహిస్తుంది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవో నెంబర్ 3 అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. గిరిజనుల వెన్నుముక్క నూటికి నూరు శాతం గిరిజనులకు ఉద్యోగాలు కల్పించేలా జీవో నెంబర్ 3 పొందుపరచి ఉంటే గిరిజనులకు అన్యాయం చేస్తూ సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 ను రద్దు చేయడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రేనని తప్పుపట్టారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జీవో నెంబర్ 3 ను చట్టబద్ధత కల్పించే లా చర్యలు తీసుకోవాలని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు చట్టంలో సంక్రమించిన హక్కులు చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.గిరిజనుల పోరాటాన్ని గిరిజనుల హక్కులు చట్టాలను కాపాడే అంతవరకు చేస్తామని అన్నారు.గిరిజనుల హక్కులు చట్టాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని అన్నారు.వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జీవో నెంబర్ 3 ను పునరుద్ధరించాలని లేకపోతే గిరిజనుల పోరాటం తీవ్రతరం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు కన్వీనర్ రామారావు దొర,కో కన్వీనర్ సుబ్రహ్మణ్యం రాధాకృష్ణ జీవో నెంబర్ 3 సాధన సమితి నాయకులు అప్పలనర్స,టిడిపి నాయకులు మాజీ మంత్రి శ్రావణ్ కుమార్, పలు ప్రజా సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
















