Distribution Water Bowl for Birds in Chippada Village for Birds Drink Water in Summer in Visakhapatnam,Vizagvision…విశాఖ చిప్పాడ లొ గ్రామస్తులు పర్యవరణం నుండి పక్షులను రక్షించుటకు వాటి దాహార్తి తీర్చుటకు ప్తతి ఇంటికి ప్రమీదలు పంచారు.
పర్యావరణ సమతుల్యత ను కాపాడటం లో పక్షులు ప్రముఖ పాత్ర పోషిస్తాయని గుర్తించిన చిప్పాడ గ్రామస్తులు. మనఊరు మన కుటుంబం యువజన సేవ సంఘం యువత పక్షులకు దాహార్తి తీర్చే కార్యక్రమము చేపట్టింది.వేసవి లో నీరు ఆహారం దొరకని పక్షులు ఇబ్బందులు దృష్టి లో ఉంచుకుని ఊరంతా ఐక్యమై ఇంటి డాబాలపై ఆహారం, ప్రమీదలు తో నీటిని పెట్టి వాటి ని పరిరక్షించాలని కంకణం కట్టుకున్నారు.500 మట్టి ప్రమీదలు ప్రతి ఇంటికి ఇస్తూ పర్యవరణం లో పక్షుల పాత్ర ఉందని,క్రిమి కీటకాలు,చీడ పీడల ను నివారించటం లో రైతులకు సహాయ పడతాయని వివరించారు.వ్యవసాయం పై చీడ పీడలు నివారణకు హానికరక క్రిమి సంహర ఔషధ ము లు ఫెర్టిలిజర్స్ వాడటం వలన పర్యావరణం కలుషితం అవుతుందని వివరించారు.
ఇంటింటికి ప్రమీదలు పంచారు.గ్రామం లో ర్యాలీ నిర్వహించారు.పక్షుల ను రక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని నినాదాలు చేశారు.ఒక గ్రామం లో మొదలయిన ఈ పక్షుల రక్షణ ఉద్యమం అన్ని గ్రామాలలో చేపడితే దేశం మొత్తం పక్షులు రక్షింపబడతాయని.
తద్వారా ప్రస్తుత భారత దేశం లో మిడతలు దండు వంటి సమస్యలు పునరావృతం కావు అనే సత్యాన్ని అందరూ గ్రహించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో చిప్పాడ మన ఊరు మన కుటుంబం యువజన సేవా సంఘం సభ్యులు,యువకులు, మాజీ సైనికులు ,ప్రజలు పాల్గొన్నారు.

















