మన్యం కనీస సదుపాయాలకు నోచుకోని గిరిజన గ్రామాలు పాడేరు in Visakhapatnam,Vizagvision…ఏజెన్సీ పాడేరు,డివిజన్ పరిధిలో వనుగుపల్లి, పంచాయతీ కి చెందిన అల్జిరు,కంగుగెడ్డ గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సమస్యలు మరింత పెరిగిపోయాయి మరోవైపు మండల అధికారులు,పాలకులు వీరి గురించి పట్టించుకోకవడం లేదు రోడ్డు రవాణా సదుపాయం లేకపోవడంతో కిలోమీటర్ల మేర అడవుల్లో గుట్టలో నడుచుకుంటూ అతికష్టం మీద మండల కార్యాలయాలకు రావాల్సి వస్తుంది కానీ వీరు గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేకపోవడం ఉన్న ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ “ఏ ఏన్ఏం” లు ఆ గిరిజన గ్రామాల్లో కి వెళ్లారు ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైన గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చిన ప్రధాన రహదారి వరకు వచ్చి అక్కడ నుంచి వాహనంలో ఆస్పత్రికి తరలించారు ఈలోగా పరిస్థితి విషమించి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఈ గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది కొన్ని గిరిజన గ్రామాలు ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండడం సమస్య కూడా తీవ్రంగానే ఉంది వీళ్లకు తాగునీటి ఊట గెడ్డ లే ఆధారం వర్షాకాలంలో ఈ గెడ్డల నీరు కలుషితమై గిరిజనులు అతిసార, టైఫాయిడ్ వంటి వాటి బారిన పడుతున్నారు వేసవిలో ఎండిపోవడంతో సుదూరంలో ఉన్న వాగులకు వెళ్లి చలమలు తీసుకుని తాగునీటిని తెచ్చుకుంటున్నారు వారికి జీవనోపాధి ఈ నీళ్లే ఇళ్లస్థలాలు స్థలాలు కావాలని రోడ్డెక్కారు ఎక్కడ చిన్న జాగా ఉన్న సర్దుకుపోతారు గృహాలు ఇవ్వమని గొడవ చేయరు పట్టించుకోరు రోడ్డు వేయమని నోరు తెరిచి అడగరు గతుకుల రోడ్డు పైన నడుస్తారు ఎవరిని ఏమి కావాలని అడిగినా అందరిదీ ఒకటే మాట ప్రతి ఒక్కరి నోట అదే తాగునీరు ఇవ్వమంటూ దినంగా ఆర్దిస్తున్నారు తరాలు గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి తమ తలరాతలు ఎందుకు మారడం లేదంటూ గిరిజన గ్రామ ప్రజలు మౌనంగా గోషిస్తున్నారు

















