Ashok Gajapathi Condalance at 3Lamps Idol in Vizianagaram,Vizagvision….
విజయనగరం పట్టణంలోని చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కుటుంబం తీవ్ర నిరసన తెలిపింది. కట్టడం కూల్చివేసిన ప్రాంతాన్ని అశోక్ తో భార్య, కుమార్తె లు పరిశీలించారు. అనంతరం అక్కడ కొవ్వొత్తులు వెలిగించి, తమ నిరసన తెలిపారు. చారిత్రక కట్టడంతో పాటు, భారత చిహ్నమైన నాలుగు సింహాల చిహ్నాన్ని అత్యంత హేయంగా మున్సిపల్ యంత్రాంగం నెలకూల్చడంపై అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని వ్యాఖ్యానించారు. అశోక్ కుటుంబం తో పలువురు టీడీపీ నేతలు, పట్టణ పౌరులు కొవ్వుత్తులు వెలిగించి తమ నిరసన తెలిపారు.