అప్పన్న స్వామి దర్శనాలు కల్పించేందుకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందిస్తిన్నట్లు సింహచలం దేవస్థానం in Visakhapatnam,Vizagvision…
51 రోజుల లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు అప్పన్న స్వామి దర్శనాలు కల్పించేందుకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందిస్తిన్నట్లు సింహచలం దేవస్థానం ఈ .ఓ . ఎం .వెంకటేశ్వరరావు తెలిపారు .దీనిలో బాగంగా సింహగిరిపై మూడగుల దూరం పాటించేలా , ఏఏ ప్రాంతాలలో శానిటైజెర్స్ సెంటర్స్ ఏర్పాటు చెయ్యాలన్న దానిపై పరిశీలన జరిపినట్లు తెలిపారు . ప్రభుత్వ అదేశాలు వచ్చినప్పటికీ కేవలం లఘు దర్శనాలు మాత్రమే భక్తులకు కల్పించనున్నట్లు తెలిపారు . గంటకు 200 నుండి 250 మంది దర్శచుకునేలా ప్రణాళికలు రూపొందించి కమీషనర్ కు అనుమతులు కు పంపుతున్నట్లు ఈ .ఓ .తెలిపారు . దర్శన టికెట్స్ కు సంబంధించి ఆన్లైన్ ద్వార ఇవ్వాళా , ఏ విధంగా అన్నది తెలియజేస్తామని ఈ .ఓ తెలిపారు . భక్తులకు తీర్ధ , ప్రసాదములు , సెటారు వంటివి ఉండవని తెలిపారు .