బ్రాహ్మణ బృందానికి నిత్యావసర సరుకులు పంపిణీ by వెంపటి చిన సత్యం కూచిపూడి కళాక్షేత్రం in Visakhapatnam,Vizagvision….కరోనా మహమ్మారి , లాక్ డౌన్ పరిస్థితుల్లో ఎటువంటి ఉపాధి కార్యక్రమాలు లేక ఇబ్బందులు పడుతున్న పదిహేను మంది బ్రాహ్మణ బృందానికి, ఈ రోజు అనగా బుధవారం ఉదయం నిత్యావసర సరకులను అందజేయడం జరిగింది. ద్వారకానగర్ సమీపంలోని బాబాపు భవన్ పక్కనే ఉన్న గాయత్రి డిగ్రీ కాలేజి ఆవరణంలో ఉన్న వెంపటి చిన సత్యం కూచిపూడి కళాక్షేత్రం విద్యార్దిని అయిన సిహెచ్.సిందుజా, తన తండ్రి శ్రీ. సీహెచ్.శ్రీనివాసరావు గారి ఆర్థిక సాయంతో ఈ పంపిణీ చేశారు. కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపాల్ హరి రామ్మూర్తి గారి పర్యవేక్షణ లో , కళాక్షేత్రం హెచ్ .ఆర్. శ్రీ. కన్నం వెంకట రమణారావు, కళాక్షేత్రం ఫాకల్టీ వివై ఎస్. జగన్నాథరావు , లక్ష్మీపతి గారు, లక్ష్మణ శర్మ గారితో పాటు పలువురు విద్యార్థుల పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.