కంటి రోగుల జీవితాల్లో శంకర్ ఫౌండేషన్ కొంగ్రొత్త వెలుగులు. ఆసుపత్రి వ్యవస్థాపకులు ఆత్మకూరి శంకరరావు ఆశయం కార్యరూపం.




శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి పేరు వినగానే కంటి రోగులు నిద్రలోనూ పరుగులు పెడుతుంటారు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన కంటి రోగుల్లో కొత్త వెలుగులు నింపుతూ నవ జీవనం వైపు వారిని నడిపిస్తోంది. చేతి కర్ర, కళ్లద్దాలను పక్కన పెడుతూ విప్పారిన నెత్రాలతో వడివడిగా అడుగులు వేయిస్తోంది… గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ ప్రాంతాల ప్రజలకు శంకర్ ఫౌండేషన్ నేత్ర దానం చేస్తూ వారిలో నూతనత్వపు బీజాలు నాటి విశేషమైన సేవలు అందిస్తోంది. కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపి నవ్య జీవనంతో ముందుకు సాగాలన్న దూరదృష్టి, సదాశయంతో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన దివంగత ఆత్మకూరి శంకరరావు 94వ జయంతి సందర్బంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని డిజిఎం కె బంగారు రాజు అన్నారు వ్యాపారవేత్త శంకరరావు ఉన్నత ఆశయంతో కంటి ఆసుపత్రిని ప్రారంభించి ఉత్తర కోస్తా,ఆంధ్రప్రదేశ్‌లోని నేత్ర రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అంధత్వాన్ని తొలగించడం మరియు పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని 1997లో సామాజిక బాధ్యతగా లోతైన భావనతో శంకరరావు, తన భార్య ఆత్మకూరి యశోద మరియు స్వర్గీయ కె. పార్వతీకుమార్, డి.వి. సుబ్బారావు సహకారంతో సింహాచలం ప్రాంతంలోని ఒక నిరాడంబరమైన రెండు పడకగదుల ఫ్లాట్‌లో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. కేవలం ఇద్దరు వైద్యులు మరియు 15 మంది ఉద్యోగులతో ఉచిత అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించారు. తరువాత అంచలంచెలుగా 2002 లో అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ రూ.20 , 2008 లో రూ.100 మరియు 2015 నుండి రూ.250 కు పెంచడము జరిగింది . గత 28 సంవత్సరాలుగా శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి నేత్ర రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ వేనోళ్ల కొనియాడబడుతోంది. నేత్రం నయనం ప్రధానం అన్నట్లు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నంలోని నాయుడుతోటలో రెండెకరాల విశాలమైన స్థలంలో 200 పడకలతో ఐదు అంతస్తులలో అత్యాధునిక సౌకర్యాలు, ఎనిమిది ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, మరియు అన్ని సబ్-స్పెషాలిటీలతో దిగ్విజయంగా నడుస్తోంది. 450 మందికి పైగా సిబ్బంది,సూపర్ స్పెషలిటీ వైద్యులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారు.ఆసుపత్రికి గట్టి భద్రతను ఏర్పాటు చేసారు..ఆసుపత్రిలో రోజుకు సగటున 120నుండి 150వరకూ కంటి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ 400 నుండి 500 మంది రోగులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు.
శంకర్ ఫౌండేషన్ గర్వంగా ఒక దృఢమైన సెంటర్ ఫర్ కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ను నిర్వహిస్తోంది, ఇది ఆవిష్కరణ మరియు అభ్యాసాన్ని చురుకుగా ప్రోత్సహిస్తుంది. గ్లాకోమా చికిత్సలో ఏ-1ఆధారిత పరిశోధన, క్లినికల్ ఖచ్చితత్వం మరియు రోగి ఫలితాలను మెరుగుపరచడంపై సహకరించడానికి ఫౌండేషన్ తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. నైపుణ్యాభివృద్ధి, నిబద్ధతను మరింత పెంచుకుంటూ కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోంది, ఇది కంటి సంరక్షణ సేవలలో ఆచరణాత్మక నైపుణ్యంతో ఔత్సాహిక నిపుణులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడిన ఉద్యోగ-ఆధారిత వృత్తి కోర్సులను అందిస్తోంది .
ఆసుపత్రి నిర్వహణకు ప్రముఖ న్యాయవాది ఎం రాందాస్ నేతృత్వంలోని ట్రస్టీల బోర్డు మార్గనిర్దేశం చేస్తోంది. మేనేజింగ్ ట్రస్టీ మరియు ఆసుపత్రి వ్యవస్థాపకులు శంకరరావు పెద్ద కుమారుడు ఆత్మకూరి కృష్ణ కుమార్ ఆసుపత్రిని సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. జనరల్ మేనేజర్ కె. రాధాకృష్ణన్, ట్రస్టీలు ప్రొఫెసర్ ఎ. ప్రసన్నకుమార్ మరియు ఎ. విజయకుమార్ ల సమిష్టి కృషి ఫలితంగా ఆసుపత్రిని కొత్త శిఖరాలకు చేర్చేందుకు దోహద పడింది.
శంకర్ ఫౌండేషన్ దినదిన ప్రవర్దమానం చెండడానికి స్వర్గీయ కె. పార్వతీకుమార్,డి.వి. సుబ్బారావు, ఎ. శంకరరావు మరియు శంకరరావు భార్య ఆత్మకూరి యశోద, కె.బి.ఎన్. మణిమాలల సహకారం ఎంతో తోడ్పాటునిచ్చింది.వారి నాయకత్వం మరియు ప్రచారం ఆసుపత్రి పరిధిని మరియు ఖ్యాతిని విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది. మణిమాల ముఖ్యమైన పాత్ర పోషించి ఆసుపత్రి స్థాయిని గణనీయంగా పెంచారు.
దివంగత ఆత్మకూరి శంకరరావు శంకర్ ఫౌండేషన్‌ను కారుణ్య కంటి సంరక్షణ కేంద్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా తయారు చేసారు.శక్తివంతమైన నిపుణులను తయారు చేయడానికి వైద్య మరియు నైపుణ్య-ఆధారిత కోర్సులను అందించే ఒక ప్రసిద్ధ విద్యా సంస్థగా కూడా తీర్చి దిద్దారు. 2011లో, ఫౌండేషన్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారిక శిక్షణా సంస్థగా గుర్తించడంతో శంకరరావు కల సాకారం అయింది. భారత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ తో సమానమైన హోదాను శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి ఇచ్చింది..శంకర్ ఫౌండేషన్ డీఎన్బీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్‌గా కూడా గుర్తింపు పొందింది.ఈ సంస్థ 30 మందికి పైగా నేషనల్ బోర్డ్ డిప్లొమేట్లకు శిక్షణ ఇచ్చింది, వారు ఇప్పుడు దేశంలోని వివిధ వైద్య సంస్థలు,ఆసుపత్రులలో పనిచేస్తున్నారు, శంకర్ ఫౌండేషన్ ఉద్యోగ,ఆధారిత వృత్తిపరమైన కోర్సులను అందించే కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రీని కూడా నిర్వహిస్తోంది అని డిజిఎం కె బంగారు రాజు అన్నారు.
శ్రీకాకుళం, మధురవాడ, మద్దిలపాలెం మరియు గాజువాకలలో శాఖల ఏర్పాటుతో శంకర్ ఫౌండేషన్ ఈ ప్రాంతంలో ప్రముఖ నేత్ర సంరక్షణ ప్రదాతగా మారింది. ఇది డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎంప్యానెల్ చేయబడింది మరియు ఈ.హెచ్. ఎస్,టీపీఐ, ప్రధాన కార్పొరేట్ సంస్థ లు మరియు రక్షణ సంస్థల ద్వారా నగదు రహిత సేవలను అందిస్తోంది. ఆసుపత్రి ప్రారంభం నుండి ఇంతవరకు 4.90 లక్షలకు పైగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించింది. 28.50 లక్షల మంది అవుట్ పేషెంట్లను పరీక్షించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా పరిపాలన ద్వారా మూడుసార్లు ఉత్తమ ఎన్జీఓ ఆసుపత్రిగా అవార్డులు పొందింది.
శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి అన్నీ రంగాల్లో విస్తరించిన నేపథ్యంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్న దృష్ట్యా దివంగత ఆత్మకూరి శంకరరావు దార్శనికత, నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది. సమాజానికి నిస్వార్ధమైన సేవలు చేయాలన్న సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి కంటి రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. నేత్ర రోగులు నూతన భవిష్యత్తు వైపు వేసే ప్రతి అడుగులోనూ శంకరరావు కలలు సాకారం కావడంతో ఆయన వరాలిచ్చే మరో శంకరుడే అయ్యారు.

















