కరోన ప్రభావంతో విధించిన లాక్ డౌన్ నియమనిబంధనలు సక్రమంగా అమలు పరచటంలో శృంగవరపుకోట పరిధిలో గల బొడ్డవర చెక్ పోస్ట్ ను జిల్లా SP రాజకుమారి మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కు సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠంకు జిల్లా సరిహద్దుల విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని ముఖ్యముగా ఇతర జిల్లాల నుండి రాష్ట్రాల నుండి రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజాము ఆరుగంటల లోపు వస్తున్నారని వారిని నియంత్రించటానికి మీరిద్దరూ నిరంతర గస్తీ నిర్వహించాలని ఎట్టి పరిస్థితులలో ప్రక్క జిల్లాల వాసులు చొరబడటానికి వీలు లేదని అన్నారు.
అలాగే లక్కవరపుకోట మండలంలో మహమాయ పరిశ్రమలో విశాఖపట్నం నుండి ఉద్యోగులు రాకూడదని ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశించామని ఇక ఎవ్వరు అలా రాకుండా మరింత కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నాము అని అన్నారు.
కరోన నియంత్రణ విషయంలో జిల్లా ప్రజలు మీడియా సహకారం మరువలేనిది అని ఈ విషయంలో ప్రతి ఒక్కరు మరిన్ని జాగ్రత్తలు పాటించి వ్యాధి ప్రభాలకుండా చూసుకోవాలని కోరారు.
అలాగే శృంగవరపుకోట పట్టణంలో రోడ్ పై స్థానిక చిత్రకారుడు కరోన పై ప్రజలకు అవగాహన పరిచేందుకు చిత్రిస్తున్న చిత్రాన్ని పరిశీలించి చిత్రకారుడు మహమ్మద్ రఫీ ని అభినందించారు.
అనంతరం పోలీసుల తో పాటు స్థానిక యువత నిర్వర్తిస్తున్న నియంత్రణ బాధ్యతలు అడిగి తెలుసుకుని వారిని అభినందించారు.
















