COVID-19 Test Center Available in KGH in Visakhapatnam,Vizagvision…
కెజిహెచ్ లో కోవిడ్-19 పరీక్ష కేంద్రం అందుబాటులోకి
లాక్ డౌన్ కు ప్రజలు మరింత సహకరించాలి
సామూహిక పూజలు, ప్రార్థనలు దయచేసి చేయవద్దు
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడి
కె.జి.హెచ్.లో కోవిడ్-19 పరీక్ష కేంద్రం అందుబాటులోకి వస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం జివియంసి కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కంపెనీలు ప్రస్తుతం రెండేసి షిప్టులు నిర్వహిస్తున్నారని, ఒకటే షిఫ్టు చేస్తే బాగుంటుందని చెప్పారు. వైద్యులకు ఎలాంటి ఇబ్బందులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అవసరమైతే మరింత మంది వైద్యులను తీసుకురానున్నామని, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులను వినియోగిస్తామని చెప్పారు. కోవిడ్-19 పరీక్ష కేంద్రం ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విశాఖ జిల్లాకు కోవిడ్-19 పరీక్ష కేంద్రంను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డికి విశాఖ జిల్లా నుండి ధన్యవాదాలు చెప్పారు. కొంత మంది ఢిల్లీ వెల్లి రావడం వలన పాజిటివ్ కేసులు పెరిగాయని, దీనివలన ఎవరు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నిత్యవసర సరుకులను ప్రజలకు అందబాటులో ఉన్నాయన్నని తెలిపారు. ఎవరైనా విదేశాల నుండి, ఢిల్లీ నుండి వచ్చిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అధికారులకు సహకరించ, స్వచ్చందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో చేరితే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి కోవిడ్-19 సోకి తిరిగి ఆరోగ్యవంతంగా ఉన్నారని, ఆయనను ఆసుపత్రి నుండి డిస్చార్జ్ చేసినట్లు చెప్పారు. రేపటి నుండి ముఖ్యమంత్రి పేదలకు రూ.1000/-లు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సామూహిక పూజలు, ప్రార్థనలు దయచేసి చేయవద్దని ఆయన కోరారు. లాక్ డౌన్ కు అందరూ సహకరించి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. ఇళ్ల నుండి ఎవరూ బయటకు రాకుండా ఉండాలన్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు లాక్ డౌన్ కు మరింత సహకరించి, ఇళ్ల నుండి బయటకు ఎవరూ రావద్దని ఆయన చెప్పారు. కోవిడ్-19 నివారణలో జిల్లా అధికార యంత్రాంగం కృషి అభినందనీయమని తెలిపారు.















