భ్యాంకుల పని వేళలు మారనున్నాయి
కరోనా కారణంగా
బ్యాంకులు ప్రస్తుతం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తుండగా గురువారం నుంచి పాత పని వేళలు అమలు కానున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయనున్నాయి. పేదలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి మోదీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు ఏప్రిల్ 2న జన్‌ధన్ ఖాతాల్లో నగదు జమకానుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో సుమారు 10 లక్షలుపైగా జన్‌ధన్ ఖాతాలున్నాయి. కేవలం మహిళల ఖాతాల్లో మాత్రమే నగదు జమ కానుంది. 3 నెలలకు సంబంధించి మొత్తాన్ని ఒకే పర్యాయం జమ చేస్తారా? లేక ఒక నెలకు సంబంధించి రూ.500 మాత్రమే వేస్తారా?
అన్నది తేలాల్సి ఉంది. ఈ లబ్ధిదారులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇతర ఖాతాదారులు బ్యాంకులకు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీ ఉంటుందని అంచనా. రద్దీ నిర్వహణ కోసం ఆర్టీసీ కండక్లర్లు, మహిళా సంఘాల ప్రతినిధులను బ్యాంకులు వాలంటీర్లుగా వినియోగించుకోనున్నాయి. బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. వీరికి రోజుకు నగదు నిర్వహణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచారు.

















