Masks & Hand Gloves Distribution by Ishaq Simca 42nd Ward in Visakhapatnam,Vizagvision…కరోనా నియంత్రణలో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటలకు దొండపర్తి
మీ సేవ కేంద్రం ఎదురుగా ఆర్ కె బజార్ వద్ద
42 వ వార్డ్ నాయకులు
ఇషాక్ సింకా ఆధ్వర్యంలో మాస్కులు చేతికి గ్లౌజులు పంపిణీ కార్యక్రమం చేశారు.
ఈ సందర్భంగా ఇషాక్ సింకా
మాట్లాడుతూ కరోనా వైరస్ ను నియంత్రించాలంటే సామాజిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముక్కుపై మాస్క్ వేసుకొని, పరిశుభ్రత పాటించాలని ప్రతి ఒక్కఋ కర్తవ్యంగా భావించాలి అని కోరారు.
ఈ ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి
ఆళ్ల శివ గణేష్, మాజీ కార్పొరేటర్ బులుసు జగదీష్, పార్టీ నాయకులు ఆళ్ళ శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు షేక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.