Minister & SP Response Police Attack on journalists at Hanuman Jn.Vijayawada,Vizagvision…
అసలేం జరిగింది..? హనుమాన్ జంక్షన్ లో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల దౌర్జన్యం. హనుమాన్ జంక్షన్ కూడలి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో బాపులపాడు మండలానికి చెందిన బొమ్ములురు, కొయ్యూరు, బొమ్ములురు కండ్రిక గ్రామాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షల ప్రకారం. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు సరుకులు కొనుగోలు చేసుకుని తిరిగి వారి స్వగ్రామాలకు వెళుతున్న వారిని జంక్షన్ కూడలిలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుకున్న బాపులపాడు మండల విలేకరులు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు దురుసుగా మాట్లాడారు. తాము బాపులపాడు (హనుమాన్ జంక్షన్) మండల విలేకరులమని చెప్పి ప్రజల కు ఇబ్బందులు లేకుండా బాపులపాడు మండల పరిధి దాటినా తరువాత పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లో పెట్టండని కోరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు ఎవరు చెప్పాడానికి అని దుర్భాషలు ఆడారు. విలేకరుల తో మాట్లాడే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించిన కృష్ణ జిల్లా పరిధిలో ని బాపులపాడు మండల విలేకరులపై ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్,ఏలూరు రూరల్ సిఐ శ్రీనివాస్, పెదపాడు ఎస్ఐ జ్యోతిబసు ఇతర పోలీసు సిబ్బంది లాఠీ ఛార్జి. బాపులపాడు మండల ప్రజల సమస్య ను ప్రస్తావించేందుకు వెళ్లిన జర్నలిస్టుల పై దాడి చేసిన పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ జంక్షన్ కూడలిలో జర్నలిస్టుల ఆందోళన. కృష్ణ జిల్లా పరిధిలో మాట్లాడుతూ ఉన్న జిల్లా పరిధి దాటి వచ్చి లాఠీ ఛార్జి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ నాయకుల డిమాండ్. *